- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణకు పాకిన ‘రప్పా.. రప్పా’ రాజకీయం! హరీశ్‌రావు సభలో పుష్ప సినిమా డైలాగ్‌తో ప్లకార్డులు వైరల్
పుష్ప-2 సినిమాలో అల్లు అర్జున్ పాపులర్ డైలాగ్స్ తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లోకి ప్రవేశించాయి.

దిశ, డైనమిక్ బ్యూరో: (Pushpa 2) పుష్ప-2 సినిమాలో అల్లు అర్జున్ (Allu Arjun) పాపులర్ డైలాగ్స్ తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లోకి ప్రవేశించాయి. ఇటీవల ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ పర్యటనలో ‘రప్పా రప్పా నరుకుతాం’ అనే పుష్ప మూవీ పాపులర్ డైలాగ్ ఫ్లెక్సీలు వైసీపీ కార్యకర్తలు ప్రదర్శించడం చర్చానీయాంశంగా మారింది. ‘2029లో వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే గంగమ్మ జాతరలో వేట తలలు నరికినట్టు (Rappa Rappa) రప్పా రప్పా నరుకుతాం ఒక్కొక్కడినీ! పొట్టేళ్లను నరికినట్టు నరుకుతాం’ అని రాసిన ఫ్లెక్సీలను కార్యకర్తలు ప్రదర్శించడం హాట్ టాపిక్‌గా మారింది. ఈ డైలాగును వైఎస్ జగన్ (YS Jagan) సమర్ధించడంతో ఏపీలో పెద్ద రచ్చే నడుస్తోంది.
దీనిపై ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, కాంగ్రెస్ నేత వైఎస్ షర్మిల తదితర టీడీపీ నేతలు సీరియస్‌గా రియాక్ట్ అయ్యారు. అయితే, ఏపీలో వివాదంగా మారిని ఈ డైలాగ్ తాజాగా తెలంగాణ రాజకీయాల్లోకి కూడా పాకింది. తాజాగా మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు (Harish Rao) సభలో రప్పా రప్పా ప్లకార్డులు దర్శనమిచ్చాయి. తాజాగా సంగారెడ్డి జిల్లాలోని జిన్నారంలో నిర్వహించిన రైతు ధర్నాలో "2028 లో రప్పా రప్పా 3.0 లోడింగ్" అంటూ బీఆర్ఎస్ (BRS) కార్యకర్తలు ప్లకార్డులు ప్రదర్శించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.






