భావి తరాలకు స్ఫూర్తిదాయకం పింగళి వెంకయ్య.. జయంతి వేళ ఎమ్మెల్సీ కవిత ట్వీట్

by Kema Shiva Kumar |   (  Updated:2025-08-02 05:00:41  IST  )

స్వాతంత్య్ర సమరయోధుడు, జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య (Pingali Venkaiah) జయంతి వేడుకలను రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు అట్టహాసంగా జరుపుకుంటున్నారు.

భావి తరాలకు స్ఫూర్తిదాయకం పింగళి వెంకయ్య.. జయంతి వేళ ఎమ్మెల్సీ కవిత ట్వీట్
X

దిశ, వెబ్‌డెస్క్: స్వాతంత్య్ర సమరయోధుడు, జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య (Pingali Venkaiah) జయంతి వేడుకలను రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు అట్టహాసంగా జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ జాగృతి వ్యవస్థపకురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘X’ (ట్విట్టర్) వేదికగా పింగళి వెంకయ్యకు ఘన నివాళులర్పిస్తూ ట్వీట్ చేశారు. జాతీయ పతాకాన్ని రూపుదిద్దిన మహనీయుడు పింగళి వెంకయ్య అని కొనియాడారు. దేశభక్తి, కృషి, నిబద్ధత భవిష్యత్తు తరాలకు ఎంతో స్ఫూర్తిదాయకమని అన్నారు. ఆయన జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తున్నా అంటూ ఎమ్మెల్సీ కవిత ట్వీట్ చేశారు.

Next Story