- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వివాదాల నిలయం 'రోహిత్ రెడ్డి' ఫామ్‌హౌజ్: బీఆర్ఎస్‌కు తలనొప్పిగా మారిన డ్రగ్స్ పార్టీ వ్యవహారం!
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌజ్ మరోసారి సెన్సేషన్‌గా మారింది.

దిశ, వెబ్‌డెస్క్: రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌజ్ మరోసారి సెన్సేషన్‌గా మారింది. తాజాగా శనివారం (మార్చి 14, 2026) రాత్రి తెలంగాణ పోలీసుల 'ఈగల్' (EAGLE) టీమ్ నిర్వహించిన మెరుపు దాడుల్లో డ్రగ్స్ పార్టీ గుట్టు రట్టయింది. ఈ ఘటనలో రోహిత్ రెడ్డి సహా ఐదుగురికి డ్రగ్ టెస్టులో పాజిటివ్ వచ్చినట్లు పోలీసులు నిర్ధారించడంతో రాజకీయంగా తీవ్ర దుమారం రేగుతోంది. ఈ నేపథ్యంలో రోహిత్ రెడ్డి ఫామ్‌హౌజ్ వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అయిపోయిందని సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ మొదలైది. గత నాలుగేళ్ల కాలంలో ఈ ఫామ్‌హౌజ్ ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తూనే ఉందని కామెంట్స్ చేస్తున్నారు. 2022లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 'ఎమ్మెల్యేల కొనుగోలు' బేరసారాలు జరిగింది ఇదే ఫామ్‌హౌజ్‌లో, ఇటీవల నిబంధనలకు విరుద్ధంగా పార్టీలు నిర్వహించారనే ఆరోపణలతో ఇదే ఫామ్‌హౌజ్‌లో ఎక్సైజ్ పోలీసులు ఇక్కడ సోదాలు, తాజా డ్రగ్స్ పార్టీతో ఈ ఫామ్‌హౌజ్ మరోసారి హాట్ టాపిక్‌గా మారింది.
బీఆర్ఎస్ అధిష్టానం రియాక్షన్ ఏంటి?
ఈ ఘటనలో రోహిత్ రెడ్డికి కొకైన్ పాజిటివ్ అని తేలడం బీఆర్ఎస్ పార్టీకి పెద్ద తలనొప్పిగా మారింది. ఇప్పుడిప్పుడే ఓటమి నుంచి కోలుకుంటున్న తరుణంలో, కీలక నేతలు ఇలాంటి కేసుల్లో ఇరుక్కోవడం పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తోందని కేడర్ భావిస్తోంది. పార్టీకి నష్టం కలిగించే కార్యకలాపాలకు పాల్పడితే ఎంతటి వారినైనా ఉపేక్షించబోమని గతంలో కేసీఆర్ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో రోహిత్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేసే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది. ఒకవైపు చట్టపరమైన చర్యలు, మరోవైపు పార్టీ అంతర్గత చర్యలు.. ఈ రెండింటి మధ్య పైలట్ రోహిత్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.






