పారిశ్రామిక వ్యర్థాల విడుదలపై హై‌కోర్టులో పిల్.. డిస్మిస్ చేసిన ధర్మాసనం

by Kema Shiva Kumar |

గోదావరి నది, ఉప నదులు, వాగులు కాలువల్లోకి శుద్ధి చేయని మురుగు నీరు, పారిశ్రామిక వ్యర్థాలను విడుదల చేయడాన్ని వెంటనే నిరోధించడానికి తగిన చర్యలు చెపట్టేలా ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టులో పిల్ దాఖలైంది.

పారిశ్రామిక వ్యర్థాల విడుదలపై హై‌కోర్టులో పిల్.. డిస్మిస్ చేసిన ధర్మాసనం
X

దిశ, తెలంగాణ బ్యూరో: గోదావరి నది, ఉప నదులు, వాగులు కాలువల్లోకి శుద్ధి చేయని మురుగు నీరు, పారిశ్రామిక వ్యర్థాలను విడుదల చేయడాన్ని వెంటనే నిరోధించడానికి తగిన చర్యలు చెపట్టేలా ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టులో పిల్ దాఖలైంది. ఈ మేరకు ఆ పిల్‌ను హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి బుధవారం దాఖలు చేశఆరు. నదుల పర్యవేక్షణ, నీటి నాణ్యత పరీక్షలను నిర్వహించాలని, కాలుష్య స్థాయిలను బహిరంగంగా బహిర్గతం చేయాలని ప్రతివాదులను ఆదేశించాలని ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, ఎన్విరాన్‌మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ, రాష్ట్ర, కేంద్ర పోల్యూషన్ కంట్రోల్ బోర్డులు, ఎంఏయూడీ, ఇండస్ట్రీ కామర్స్ విభాగాలను ప్రతివాదులుగా పేర్కొన్నారు. అయితే ఆ పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం ఇరు పక్షాల వాదనలు విని పిల్‌ను డిస్మిస్ చేస్తున్నట్లుగా ప్రకటించింది.

Next Story