‘ఒక్క కొత్త షాపు పెట్టినా ఊరుకోము’.. మార్వాడీలకు పిడమర్తి రవి హెచ్చరిక

by Gantepaka Srikanth |

మార్వాడీ(Marwadi)లకు ఎస్సీ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ పిడమర్తి రవి(Pidamarthi Ravi) సంచలన వార్నింగ్ ఇచ్చారు.

‘ఒక్క కొత్త షాపు పెట్టినా ఊరుకోము’.. మార్వాడీలకు పిడమర్తి రవి హెచ్చరిక
X

దిశ, వెబ్‌డెస్క్: మార్వాడీ(Marwadi)లకు ఎస్సీ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ పిడమర్తి రవి(Pidamarthi Ravi) సంచలన వార్నింగ్ ఇచ్చారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఒక్క కొత్త షాపు పెట్టినా ఊరుకోము అని హెచ్చరించారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితోనే ‘మార్వాడీ గో బ్యాక్’ ఉద్యమం చేపడతాం అని కీలక ప్రకటన చేశారు. తెలంగాణను వదిలి వెళ్లే వరకు వారికి వ్యతిరేకంగా పోరాటం చేస్తామని అన్నారు. మార్వాడీ వ్యాపారులు జీఎస్టీ కట్టరు, బిల్లు ఇవ్వరు, ఇక్కడ డబ్బులు దండుకొని గుజరాత్, రాజస్థాన్‌కు వెళ్తారని హాట్ కామెంట్స్ చేశారు. మార్వాడీల చందాలతో బీజేపీ బతుకుతోంది.. అందుకే బండి సంజయ్ వారికి మద్దతు ఇస్తున్నారని హాట్ కామెంట్స్ చేశారు. సోమవారం నాటి ఆమనగల్ బంద్‌తో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని అన్నారు. ఇదిలా ఉంటే.. ‘గో బ్యాక్ మార్వాడీ’ అంటూ కొనసాగుతున్న ప్రచారం బాగా వైరలవుతున్నది. ఇటు సామాజిక ఉద్యమకారులు, అటు రాజకీయ పార్టీ నాయకుల కూడా స్పందిస్తుండటంతో ప్రజల్లో కూడా చర్చ నడుస్తున్నది. ఈ పరంపరలో ‘మార్వాడీ వ్యాపారులు గో బ్యాక్’​ అంటూ ఈ నెల 18న రంగారెడ్డి జిల్లా ఆమనగల్లులో స్థానిక వ్యాపారవర్గాల వారు బంద్​కు పిలుపునివ్వడంతో ఈ అంశం రాష్ట్రస్థాయిలో చర్చనీయాంశంగా మారింది.

Next Story