- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మందకృష్ణ మాదిగపై పిడమర్తి రవి హాట్ కామెంట్స్
ఎమ్మార్పీఎస్(MRPS) వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ(Manda Krishna Madiga)పై ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి(Pidamarthi Ravi) కీలక వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: ఎమ్మార్పీఎస్(MRPS) వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ(Manda Krishna Madiga)పై ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి(Pidamarthi Ravi) కీలక వ్యాఖ్యలు చేశారు. ఎస్సీ వర్గీకరణ అమలు విజయోత్సవ సభలో పిడమర్తి రవి పాల్గొని మాట్లాడారు. 30 సంవత్సరాల మాదిగల నిర్వీరామ పోరాట ఫలితంగా మాదిగలకు 9 శాతం రిజర్వేషన్ కల్పించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణలో ముఖ్యమంత్రి వల్ల మాదిగలకు న్యాయం జరుగుతుంటే.. ఆంధ్రప్రదేశ్‌లో మందకృష్ణ వల్ల మాదిగలకు అన్యాయం జరుగుతుందని అన్నారు.
రోస్టర్ పాయింట్ 6 శాతం కాకుండా 7 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు మందకృష్ణ మాదిగ కృషి చేయాలని సూచించారు. వర్గీకరణ విజయోత్సవ సభకు ప్రతి ఇంటి నుండి ఒకరు వచ్చి సభను జయప్రదం చేయాలని కోరారు. ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాల వర్గీకరణ జీవో వచ్చిన తర్వాత, తెలంగాణలో కూడా జిల్లాల వర్గీకరణ చేయాలని సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని పిడమర్తి రవి ప్రకటన చేశారు. ఈ సంబరాల కార్యక్రమంలో మాదిగ జేఏసీ జిల్లా అద్యక్షులు కురుపాటి సుదర్శన్, యూత్ రాష్ట్ర అద్యక్షులు నక్క మహేష్, ఓయూ అద్యక్షులు జోగు గణేష్, సంజీవ, విజయ్, జంగయ్య, జగన్, సమ్రాట్ కిరణ్, శంకర్, రవి, చిరంజీవి, రవి. హరికృష్ణ, లక్ష్మణ్, కత్తుల రవి, తదితరులు పాల్గొన్నారు.






