Telangana Thalli : విగ్రహావిష్కరణకు ముందే జనంలోకి తెలంగాణ తల్లి ఫోటోలు

by Y. Venkata Narasimha Reddy |

రాష్ట్ర సచివాలయంలో రేపు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఆవిష్కరించనున్న తెలంగాణ తల్లి విగ్రహాం(Telangana Thalli Statue) ఫోటోలను ప్రభుత్వం జనబాహుళ్యంలో విస్త్రృత ప్రచారంలోకి తీసుకొచ్చింది.

Telangana Thalli : విగ్రహావిష్కరణకు ముందే జనంలోకి తెలంగాణ తల్లి ఫోటోలు
X

దిశ, వెబ్ డెస్క్ : రాష్ట్ర సచివాలయంలో రేపు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఆవిష్కరించనున్న తెలంగాణ తల్లి విగ్రహాం(Telangana Thalli Statue) ఫోటోలను ప్రభుత్వం జనబాహుళ్యంలో విస్త్రృత ప్రచారంలోకి తీసుకొచ్చింది. సచివాలయంలో ఆవిష్కరించనున్న తెలంగాణ తల్లి విగ్రహాం ఆకృతిపై చివరి వరకు సస్పెన్స్ పాటించి రెండు రోజుల క్రితం ఫోటోలను విడుదల చేశారు. ఆదివారం మెట్రో పిల్లర్లపై కాంగ్రెస్ ప్రభుత్వం రూపొందించిన తెలంగాణ తల్లి ఫోటోలతో కూడిన ప్రచార ప్రకటన బోర్డుల(Photos on metro pillars)ను ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రేపు ఆవిష్కరించనున్న తెలంగాణ తల్లి విగ్రహాం రూపురేఖలపై జోరుగా చర్చోపచర్చలు రేకెత్తినప్పటికి బీఆర్ఎస్ వర్గాల నుంచి మినహా పెద్దగా వ్యతిరేకత వ్యక్తం కాలేదు.

సీఎంగా రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి విగ్రహం విషయంలో తను గతంలో చెప్పిన మేరకే చేస్తున్నారన్న అభిప్రాయంతో సరిపెట్టుకున్నారు. ఈ క్రమంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ ముహూర్తం దగ్గర పడటంతో ఈ కార్యక్రమానికి ప్రతిపక్షాలను అహ్వానించిన ప్రభుత్వం ఇప్పుడు ప్రజల్లోకి ఈ కార్యక్రమాన్ని, తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ స్ఫూర్తిని తీసుకెళ్లే చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా తెలంగాణ తల్లి విగ్రహం ఫోటోలతో కూడిన అధికారిక ప్రచార ప్రకటన బోర్డులను, కటౌట్లను ఏర్పాటు చేస్తూ ప్రచార ప్రకటనలతో విస్తృత ప్రచారానికి తెరలేపింది. నగరంలోని మెట్రో పిల్లర్లపై కాంగ్రెస్ ప్రభుత్వం రూపొందించిన తెలంగాణ తల్లి ఫోటోల ప్రచార ప్రకటన బోర్డులు ఇప్పుడు ప్రధానాకర్షణగా మారాయి.

Next Story