జూబ్లీహిల్స్‌ ఓటర్లకు బిగ్ అలర్ట్.. ఫొటో ఐడీ తప్పనిసరి

by Gantepaka Srikanth |

జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలో నవంబర్‌ 11న జరగబోయే ఉపఎన్నికలో ఓటు వేయడానికి వచ్చే ప్రతీ ఓటరు తప్పనిసరిగా ఫొటో గుర్తింపు కార్డు తీసుకురావాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి.సుదర్శన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.

జూబ్లీహిల్స్‌ ఓటర్లకు బిగ్ అలర్ట్.. ఫొటో ఐడీ తప్పనిసరి
X

దిశ, వెబ్‌డెస్క్: జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలో నవంబర్‌ 11న జరగబోయే ఉపఎన్నికలో ఓటు వేయడానికి వచ్చే ప్రతీ ఓటరు తప్పనిసరిగా ఫొటో గుర్తింపు కార్డు తీసుకురావాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి.సుదర్శన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. భారత ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం, ప్రతి ఓటరు పోలింగ్‌ కేంద్రంలో ఓటు వేయడానికి ముందు తమ ఓటరు ఫొటో ఐడీ కార్డు(EPIC) చూపించాలి. EPIC లేని వారు కింద పేర్కొన్న 12 ఫొటో గుర్తింపు పత్రాలలో ఏదైనా ఒకదాన్ని చూపించవచ్చని అన్నారు.

1. ఆధార్‌ కార్డు

2. ఎంఎన్‌ఆర్‌ఈజీఎ ఉద్యోగ కార్డు

3. బ్యాంకు లేదా పోస్టాఫీస్‌ జారీ చేసిన ఫొటో ఉన్న పాస్‌బుక్‌

4. హెల్త్‌ ఇన్ష్యూరెన్స్‌ స్మార్ట్‌ కార్డు (ఆయుష్మాన్‌ భారత్‌ కార్డు సహా)

5. డ్రైవింగ్‌ లైసెన్స్‌

6. పాన్‌ కార్డు

7. నేషనల్‌ పాప్యులేషన్‌ రిజిస్టర్‌ (ఎన్‌పీఆర్‌) కింద జారీ చేసిన స్మార్ట్‌ కార్డు

8. భారత పాస్‌పోర్టు

9. ఫొటోతో ఉన్న పెన్షన్‌ పత్రం

10. ప్రభుత్వ, పీఎస్‌యూ లేదా పబ్లిక్‌ లిమిటెడ్‌ కంపెనీలు జారీ చేసిన ఉద్యోగి గుర్తింపు కార్డు

11. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల అధికార గుర్తింపు కార్డు

12. సామాజిక న్యాయశాఖ జారీ చేసిన వికలాంగుల యూనిక్‌ ఐడీ (UDID) కార్డు

విదేశీ ఓటర్లు (Representation of the People Act, 1950 లోని సెక్షన్‌ 20A ప్రకారం నమోదు అయిన వారు) తమ మూల భారత పాస్‌పోర్టు చూపించాలి. ఓటరు సమాచారం స్లిప్‌లు పోలింగ్‌కు కనీసం ఐదు రోజుల ముందుగానే పంపిణీ చేస్తారు. అయితే అవి గుర్తింపు పత్రాలుగా ఉపయోగించరాదు. జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలోని ఓటర్లు తమ పేరు ఓటరు జాబితాలో ఉందో లేదో ధృవీకరించుకుని, చెల్లుబాటు అయ్యే ఫోటో ఐడీతో పోలింగ్‌ కేంద్రాలకు వచ్చి నవంబర్‌ 11న బాధ్యతగా ఓటు వేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్‌ రెడ్డి పిలుపునిచ్చారు.

Next Story