'వికసిత్ భారత్ కా అమృత్ కాల్' బీజేపీ స్టేట్ ఆఫీస్‌లో మోడీ పాలనపై ఫొటో ఎగ్జిబిషన్‌

by Ramesh Naini |   (  Updated:2025-06-10 11:37:14  IST  )

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పాలన 11 ఏళ్ళు పూర్తిచేసుకుని,12 వ ఏడాదిలోకి అడుగు పెట్టింది.

వికసిత్ భారత్ కా అమృత్ కాల్  బీజేపీ స్టేట్ ఆఫీస్‌లో మోడీ పాలనపై ఫొటో ఎగ్జిబిషన్‌
X

దిశ, డైనమిక్ బ్యూరో: (modi 3.0 govt) ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పాలన (11 years of rule) 11 ఏళ్ళు పూర్తిచేసుకుని,12 వ ఏడాదిలోకి అడుగు పెట్టింది. జూన్ 9 నుంచి మోడీ 3.0 ప్రభుత్వం తొలి వార్షికోత్సవం జరుపుతోంది. దేశవ్యాప్తంగా మోడీ పాలనపై ఫోటో (Photo exhibition) ఎగ్జిబిషన్‌లు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలోనే నరేంద్ర మోడీ పదకొండేళ్ల పాలనపై ఇవాళ (మంగళవారం) హైదారబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు.

'వికసిత్ భారత్ కా అమృత్ కాల్' ప్రదర్శనశాల పేరుతో ఫోటో ఎగ్జిబిషన్‌ను కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రారంభించారు. మోడీ సంక్షేమ పథకాలు, అభివృద్ధి, సాహసోపేతమైన నిర్ణయాలు ప్రతిబింబిస్తూ ఎగ్జిబిషన్‌లో బ్యానర్లు, ఫోటోలు ఏర్పాటు చేశారు. కాగా, ప్రధాని నరేంద్ర మోడీ 11 ఏళ్ల పాలనలో ఒక్క అవినీతి ఆరోపణ లేదని, పేదల సంక్షేమానికి ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేకూర్చాలని, సంక్షేమ ఫలాలను అందించాలనే లక్ష్యంతో మోడీ ప్రభుత్వం ముందుకెళ్తోందని స్పష్టం చేశారు.

Next Story