వావి వరుసలు లేకుండా ఫోన్లు ట్యాప్ చేశారు.. బండి సంజయ్ సంచలన ఆరోపణలు

by Kema Shiva Kumar |

ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ ఎదుట కేంద్ర మంత్రి బండి సంజయ్ విచారణ ముగిసింది.

వావి వరుసలు లేకుండా ఫోన్లు ట్యాప్ చేశారు.. బండి సంజయ్ సంచలన ఆరోపణలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ ఎదుట కేంద్ర మంత్రి బండి సంజయ్ విచారణ ముగిసింది. దాదాపు రెండున్నర గంటల పాటు విచారణ కొనసాగింది. ఈ క్రమంలోనే ఆయన కేసుకు సంబంధించి పలు కీలక ఆధారాల ఫైల్‌ను దర్యాప్తు అధికారులకు అందజేశారు. విచారణ అనంతరం బయటకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఫోన్లు ట్యాప్ అయిన వారి జాబితాలో రేవంత్ రెడ్డితో పాటు హరీశ్ రావు పేర్లు కూడా ఉన్నాయని తెలిపారు. బీఆర్ఎస్ పాలనలో తన ఫోన్ ఎక్కువగా ట్యాప్ చేశారని ఆరోపించారు. సిట్ అధికారులు ట్యాపింగ్‌కు సంబంధించి చూపించిన వివరాలు చూసి తాను షాక్‌కు గురయ్యానని తెలిపారు. మావోయిస్టుల జాబితాలో మా పేర్లు పెట్టి ట్యాపింగ్‌కు పాల్పడ్డారని ఫైర్ అయ్యారు. ఫోన్ ట్యాపింగ్ జరిగిందని తాను.. అప్పట్లోనే చెప్పానని అన్నారు. వావి వరుసలు లేకుండా ఫోన్లు ట్యాప్ చేశారని మండిపడ్డారు. చివరికి తన ఇంట్లో సిబ్బంది ఫోన్లు కూడా ట్యాప్ చేయడం దారుణమని అన్నారు. కేసీఆర్ కూతురు కవిత ఫోన్లను కూడా విపరీతంగా ట్యాప్ చేశారని పేర్కొన్నారు. ముఖ్యంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సమయంలో నా చుట్టూ నిఘా పెట్టారని ఆరోపించారు. కేసీఆర్ పాలనలో చివరికి సామాన్యుల కూడా ఫోన్లు మాట్లాడలేకపోయారని బండి సంజయ్ ధ్వజమెత్తారు. ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడిన రాధాకిషన్ రావు, ప్రభాకర్ రావుకు ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేశారు. కానీ, రేవంత్ సర్కార్ నిందితులకు కాపాడే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. కేసును ఇంకా సాగిదీస్తున్నారని బండి సంజయ్ ఫైర్ అయ్యారు.

బండి సంజయ్ సిట్‌కు అందజేసిన ఆధారాలు ఇవే..

సిట్ విచారణకు హాజరైన బండి సంజయ్ అధికారులకు కీలక ఆధారాలు అందజేశారు. అందులో 317 జీవో రద్దు కోసం ఉద్యమ కార్యచరణ లీకైందని సిట్ అధికారుల తెలిపారు. ఆ క్రమంలనే ముందుగానే బండి సంజయ్ అరెస్టుకు కరీంనగర్ పోలీసులు సిద్ధమయ్యారని తెలిపారు. ప్రజా సంగ్రామ యాత్రలో ఎక్కడెక్కడ ఎవరెవరిని కలవబోతున్నారు అన్న సమాచారం కూడా తెలుసుకున్నారని తెలిపారు. తద్వారా వారిన కలువనివ్వకుండా చేశారని సిట్‌కు ఆధారాలు సమర్పించారు. గ్రూప్-1 అభ్యర్థుల పక్షాన పోరాడేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్న క్రమంలో ఫోన్ ట్యాప్ చేశారని పేర్కొన్నారు. పార్టీ కార్యక్రమాల అనుమతుల కోసం హైకోర్టుకు వెళ్లిన సమయంలో జడ్జీల ఫోన్లు సైతం టైపింగ్ చేశారని విచారణ అధికారులకు బండి తెలిపారు. ఇక వివిధ కేసుల్లో తన బెయిల్ పిటిషన్ విచారించిన జడ్జిల ఫోన్లను సైతం టాప్ చేసినట్లుగా కేంద్ర సేకరించిన ఆధారాలను చూపించారు. వాటికి సంబంధించిన ఆధారాలు, హార్డ్ కాపీలు, సాఫ్ట్ కాపీలను సిట్‌కు అందజేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి మాజీ పోలీస్ అధికారులు, ఐబీ అధికారుల నుంచి కీలక ఆధారాలు సేకరించి వారికి సమర్పించారు. కొన్ని ఆడియో రికార్డులను సైతం పెన్‌డ్రైవ్‌లో సిట్‌కు అందజేసినట్లుగా సమాచారం.

Next Story