ఫోన్ ట్యాపింగ్ కేసు.. న్యాయమూర్తుల స్టేట్మెంట్ కోసం సిట్ సన్నాహాలు

by Ajay Maddhiboyina |

ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణను సిట్ అధికారులు ముమ్మరం చేశారు. బాధితుల నుంచి వాగ్మూలం తీసుకుంటున్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహరంలో సిట్ అధికారులు రాజకియ నాయకుల , ఐపిఎస్, ఐఏఎస్ అధికారుల వాగ్ములాలు ఇప్పటివరకు తీసుకున్నారు.

ఫోన్ ట్యాపింగ్ కేసు.. న్యాయమూర్తుల స్టేట్మెంట్ కోసం సిట్ సన్నాహాలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణను సిట్ అధికారులు ముమ్మరం చేశారు. బాధితుల నుంచి వాగ్మూలం తీసుకుంటున్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహరంలో సిట్ అధికారులు రాజకియ నాయకుల , ఐపిఎస్, ఐఏఎస్ అధికారుల వాగ్ములాలు ఇప్పటివరకు తీసుకున్నారు. మరి కొంత మందికి విచారణకు హజరవ్వాలని సమాచారం ఇచ్చారు. తాజాగా హై కోర్టు జడ్జిల స్టేట్మెంట్ తీసుకునేందుకు సిట్ అధికారులు సమయత్తాం అయినట్లుగా తెలుస్తుంది. సిట్ అధికారులు స్వయంగా వెళ్ళి స్టేట్మెంట్ తీసుకోనున్నట్లు సమాచారం . వారితో పాటు మీడియా సంస్థల ప్రతినిధులు, సీనియర్ జర్నలిస్టుల నుంచి వాగ్మూలం తీసుకునేందుకు చర్యలు చెపట్టినట్లు తెలుస్తుంది. ప్రముఖ మీడియా సంస్థ ఛైర్మన్ కుడా సిట్ అధికారులు విచారణకు రావాలని సమాచారం ఇచ్చినట్లుగా తెలుస్తున్నది. ట్యాపింగ్ కేసులో సీనియర్ జర్నలిస్ట్ బొబ్బల సునీల్ రెడ్డి కి సిట్ నుంచి పిలుపు వచ్చింది. ఒకటి, రెండు రోజులలో స్టేట్మెంట్ రికార్డు చేయనున్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహరంలో బాధితులలో సినీ ప్రముఖుల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. సీని ప్రముఖులకు, వ్యాపారస్తులకు సంబంధించిన వివరాలు సిట్ అధికారులు నోటీసులు బహిర్గతం చేయలేదు.

ఇప్పటివరకు 220మందికి పైగా స్టేట్మెంట్ రికార్డింగ్ చేసినట్లు సిట్ అధికారులు వెల్లడిస్తున్నారు. ఇంకా కేంద్రమంత్రి బండి సంజయ్, బీజేపి ఎంపిలు అరవింద్, రఘునందన్ రావులను విచారించాల్సి ఉంది. బీఆర్ఎస్ నేతలు మాజీ ఎమ్మెల్యేలు పద్మా దేవేందర్ రెడ్డి , మర్రి జనార్ధన్ రెడ్డి, తాటి కొండ రాజయ్య లకు సిట్ అధికారులు నోటీసులు ఇవ్వనున్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్య నేతల ఫోన్లు చాలా వరకు ట్యాపింగ్ గురైనట్లు సిట్ విచారిస్తుంది. ఈ క్రమంలో 2018 ఎన్నికలప్పడు జరిగిన సందర్భాలను, జరిగిన పోలీస్ చెకింగ్ లను గుర్తు చేసుకుంటున్నారు. ప్రణీత్ రావు అండ్ టీమ్ 2023 నవంబర్ 15 నుంచి నవంబర్ 30 వరకు 4వేలకు పైగా పోన్ నెంబర్లను ట్యాపింగ్ చేశారని సిట్ విచారణలో వెల్లడవుతున్నట్లు తెలుస్తుంది. ప్రభాకర్ రావు రివ్యూ కమిటికి 8 సార్లు ఫోన్ నెంబర్లను ఇచ్చినట్లు సిట్ల అధికారులు గుర్తించినట్లు తెలుస్తున్నది. 8 సందర్భాలలో మాత్రం 35 నెంబర్లు మాత్రం రిపిటెడ్ గా ఇచ్చినట్లు సిట్ అధికారులు నిర్ధారించారు. ఆ నెంబర్లలో ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి సోదరులు, మంత్రి పోంగులేటి శ్రీనివాస్ రెడ్డి సోదరుడు, ఉన్నట్లు గుర్తించినట్లు తెలుస్తుంది. ప్రభాకర్ రావు ఆదేశాల మేరకు పలువురు మహిళ ఐఏఎస్ అధికారుల ఫోన్ నెంబర్లను కూడా ట్యాపింగ్ చేసినట్లు వెల్లడవుతుందని సమాచారం. ఈ అంశం మాత్రం సిట్ అధికారులు గోప్యంగా ఉంచుతున్నారు..

బీఆర్ఎస్ ప్రభుత్వం దిగజారుడు రాజకీయం చేసింది: ఎమ్మెల్సీ డాక్టర్ బల్మూరు వెంకట్,

మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్స్ సొసైటీ చైర్మన్ ఫహీం ఖురేషి

అనాటి పాలకుల దుర్మార్గమైన చర్యకు తలూపి, ఫోన్లు ట్యాపింగ్ కు పాల్పడిన అధికారులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని సీఎం ని కోరతామని ఎమ్మెల్సీ డాక్టర్ బల్మూరు వెంకట్ తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం దిగజారుడు రాజకీయం చేసిందని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు జూబ్లీ హిల్స్ పీఎస్ల లో ఎమ్మెల్సీ డాక్టర్ బల్మూరు వెంకట్, మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్స్ సొసైటీ చైర్మన్ ఫహీం ఖురేషిలు బుధవారం హజరయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. మరో సారి అధికారం కోసం ఫోన్ ట్యాపింగ్ తో ప్రత్యర్థుల కుటుంబాలను టార్గెట్ చేయడం నీచమైన చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మా ఫోన్లు ట్యాప్ చేసి... మమ్మల్ని ఎక్కడిక్కడ నిర్భదించడం, అరెస్టులు చేయడం హేయమైన చర్యలని అన్నారు. వారి పర్సనల్ సంభాషణలు విని బ్లాక్ మెయిల్ చేయడం తీవ్రమైన నేరం అని అన్నారు. ట్యాపింగ్ కు పాల్పడిన వారికి కూడా కుటుంబాలు, కుటుంబ సభ్యులు ఉంటారు, కదా... వారి ఫోన్లు కూడా ట్యాప్ చేస్తే తెలిసేది వారి బాధ అని మండి పడ్డారు. ట్యాపింగ్ చేసిన ఫోన్ నంబర్ల వివరాలు, మెసేజ్ లను అధికారులు మాకు చూపించారని తెలిపారు.

Next Story