- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. అప్పటి హోమ్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఐపీఎస్ జితేందర్‌తో పాటు ఇంటిలిజెన్స్ చీఫ్ అనిల్ కుమార్‌ను సిట్ ప్రశ్నించింది.

దిశ, వెబ్ డెస్క్: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. అప్పటి హోమ్ ప్రిన్సిపల్ సెక్రటరీ, ప్రస్తుత డీజీపీ జితేందర్‌తో పాటు నాటి ఇంటెలీజెన్స్ చీఫ్, ప్రస్తుత అడిషనల్ డీజీపీ అనిల్ కుమార్‌ను సిట్ ప్రశ్నించింది. జితేందర్, అనిల్ కుమార్ వద్ద నుండి సిట్ స్టేట్మెంట్ రికార్డు చేసింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో రివ్యూ కమిటీలో జితేందర్, అనిల్ కీలక సభ్యులుగా ఉన్నారు. దీంతో వారి స్టేట్మెంట్ కీలకంగా మారనుంది. ఇదిలా ఉంటే రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రభాకర్ రావు విచారణ జరుగుతుండటంతో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మావోయిస్టు సానుభూతిపరుల పేరుతో ఫోన్ ట్యాపింగ్ జరిగినట్టు విచారణతో తేలింది. మొత్తం 4200 మంది ఫోన్లను ట్యాప్ చేసినట్టు అధికారులు గుర్తించారు.






