Phone Tapping Case: ‘సిట్’ వద్ద ఆ 15 రోజుల డేటానే ఉంది.. విచారణ అనంతరం శివకుమార్ సంచలన వ్యాఖ్యలు

by Kema Shiva Kumar |   (  Updated:2026-04-28 08:46:19  IST  )

తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో శివకుమార్ యుగ తులసీ ఫౌండేషన్ చైర్మన్ విచారణ ముగిసింది.

Phone Tapping Case: ‘సిట్’ వద్ద ఆ 15 రోజుల డేటానే ఉంది.. విచారణ అనంతరం శివకుమార్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు రాష్ట్రాలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణను ఎదుర్కొన్న యుగ తులసీ ఫౌండేషన్ చైర్మన్ శివకుమార్ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. విచారణ అనంతరం ఆయన మీడియాలో మాట్లాడుతూ.. సిట్ అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు తాను సమాధానం ఇచ్చానని, అయితే ఆ విచారణ వల్ల పెద్దగా ప్రయోజనం ఉంటుందని తాను భావించడం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. మునుగోడు ఉప ఎన్నికల సమయంలో తన ఫోన్ ట్యాపింగ్ జరిగిందని అధికారులు నిర్ధారించారని శివకుమార్ తెలిపారు. అయితే, ఆ ఎన్నికల్లో తాను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశానని, కేంద్ర ఎన్నికల సంఘం తనకు ‘రోలర్’ గుర్తు కేటాయించిందని ఆయన గుర్తు చేశారు. ఇది సిట్ టీం కాదు.. ఇది స్పెషల్ ఇంట్రెస్ట్ ఆన్ బీఆర్ఎస్‌లాగా ఉందని శివకుమార్ అన్నారు.

అప్పటి ఎస్ఐబీ చీఫ్ ఫోన్..

విచారణలో భాగంగా అప్పటి ఎస్‌ఐబీ (SIB) చీఫ్ ప్రభాకర్ రావు, ఆయన టీమ్ శివకుమార్ ఫోన్ ట్యాప్ చేసినట్లుగా సిట్‌ అధికారులు తెలిపినట్లుగా పేర్కొన్నారు. విచారణ సందర్భంగా అధికారులు తనకు కొన్ని కీలక ఆధారాలు చూపించారని, అయితే వారి వద్ద పూర్తి స్థాయి సమాచారం కూడా లేదని పేర్కొన్నారు. నిందితులు కీలక సమాచారాన్ని ధ్వంసం చేయడంతో అధికారుల వద్ద కేవలం 15 రోజులకు సంబంధించిన డేటా మాత్రమే అందుబాటులో ఉందని ఆయన పేర్కొన్నారు. విచారణలో భాగంగా తన రాజకీయ సంబంధాలు, ఎవరెవరితో టచ్‌లో ఉన్నారనే అంశాలపై అధికారులు ఆరా తీసినట్లుగా ఆయన వివరించారు. అయితే, ఫోన్ ట్యాపింగ్ వంటి తీవ్రమైన నేరంలో సిట్ విచారణ కేవలం నామమాత్రంగానే సాగుతోందని, దీంతో ఒరిగేది ఏమీ లేదని శివకుమార్ చెప్పడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

Next Story