- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Phone Tapping Case : ఫోన్ ట్యాపింగ్ కేసు.. ముగిసిన ప్రభాకర్ రావు విచారణ
ఫోన్ ట్యాపింగ్ కేసు(Phone Tapping Case)లో ప్రధాన నిందితుడు(A1), SIB మాజీ చీఫ్ ప్రభాకర్ రావు(Prabhakar Rao) నేటి సిట్ విచారణ(SIT Inquiry) ముగిసింది.

దిశ, వెబ్ డెస్క్ : ఫోన్ ట్యాపింగ్ కేసు(Phone Tapping Case)లో ప్రధాన నిందితుడు(A1), SIB మాజీ చీఫ్ ప్రభాకర్ రావు(Prabhakar Rao) నేటి సిట్ విచారణ(SIT Enquiery) ముగిసింది. దాదాపు 8 గంటలపాటు సుదీర్ఘంగా ఆయనను సిట్ అధికారులు విచారించారు. అయితే ఈనెల 11న మరోసారి విచారణకు రావాలని అధికారులు ప్రభాకర్ రావుకు తెలియజేశారు. దీంతో మరోమారు ఆయన సిట్ ముందుకు రానున్నారు.
తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో A1 నిందితుడుగా ఉన్న ప్రభాకర్ రావు.. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2014-2023 మధ్య రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తల ఫోన్లను అక్రమంగా ట్యాప్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంపై 2024 మార్చి 10న పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఆయనపై కేసు నమోదైంది. ఆ తర్వాత ప్రభాకర్ రావు అమెరికాకు పరారయ్యారు. మే 29న సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాల మేరకు.. ప్రభాకర్ రావుకు వన్-టైమ్ ట్రావెల్ పర్మిట్ జారీ చేస్తూ, మూడు రోజుల్లో భారత్‌కు తిరిగి రావాలని, విచారణకు హాజరు కావాలని పేర్కొనడంతో... నేడు ఆయన సిట్ ముందుకు వచ్చారు.






