Phone tapping case: ఆధారాలు ఉంటే చూపించండి.. సిట్ అధికారులకే ప్రభాకర్ రావు ఎదురు ప్రశ్నలు!

by Prasad Jukanti |   (  Updated:2025-06-09 11:44:37  IST  )

ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరైన ప్రభాకర్ రావు సిట్ అధికారుల ప్రశ్నలకు నోరు మెదపడం లేనట్లు తెలుస్తోంది.

Phone tapping case: ఆధారాలు ఉంటే చూపించండి.. సిట్  అధికారులకే ప్రభాకర్ రావు ఎదురు ప్రశ్నలు!
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఫోన్ ట్యాపింగ్ కేసులో (Phone tapping case) ఏ1 నిందితుడు ప్రభాకర్ రావును వెస్ట్‌జోన్ డీసీపీ విజయ్ కుమార్ నేతృత్వంలోని దర్యాప్తు బృందం ఇవాళ ప్రశ్నిస్తోంది. కేసు నమోదు కాగానే విదేశాలకు ఎందుకు పారిపోయారు?, రాజీనామా చేసిన రోజే ఎందుకు హార్డ్‌డిస్క్‌లను ధ్వంసం చేశారు? మీ ఆదేశాలతోనే ప్రణీత్‌రావు ధ్వంసం చేశారా? అని ప్రశ్నించినట్టు తెలుస్తోంది. ఎవరు చెప్తే స్పెషల్ ఆపరేషన్ టీమ్‌ను ఏర్పాటు చేశారని ఆరాతీసినట్టు సమాచారం. హార్డ్‌డిస్క్‌ల ధ్వంసం వెనుక కుట్ర స్పష్టంగా కనిపిస్తోందని, శ్రవణ్‌రావుకు ఎస్ఐబీతో సంబంధం ఏంటి? అని ప్రశ్నించారని టాక్ వినిపిస్తోంది. దాదాపు 4000 నెంబర్లను ట్యాప్ చేసినట్లు తమ వద్ద ఆధారాలు ఉన్నాయని, దీని వెనుక ఉన్న మాస్టర్ మైండ్ ఎవరు అనేది తేర్చేందుకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విచారణలో భాగంగా ఇవాళ ప్రభాకర్ రావు స్టేట్ మెంట్ రికార్డు చేస్తున్నారు. అయితే సిట్ ప్రశ్నలకు ప్రభాకర్‌రావు (Prabhakar Rao) సరిగా సమాధానాలు చెప్పడం లేదని తెలుస్తోంది. అధికారులకే ఎదురు ప్రశ్నలు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్‌పై రివ్యూ కమిటీ ఉంటుందని, ఆ కమిటీలో తాను సభ్యుడిని కాదని, ట్యాపింగ్ చేయాలని తాను ఆదేశాలు ఇవ్వలేదని, ఆధారాలు ఉంటే చూపించాలని చెప్పినట్టు తెలుస్తోంది. హార్డ్ డిస్క్‌లు ధ్వంసం అయితే దానికి తనకు ఏం సంబంధం అని అడిగినట్లు సమాచారం. రివ్యూ కమిటీ సభ్యులను ఎందుకు కేసులో ఇన్వాల్వ్ చేయలేదని సిట్‌ను ప్రభాకర్ రావు అడిగారు. గతంలో కోర్టులో వినిపించిన వాదనలనే మరోసారి సిట్ (SIT) ఎదుట ఆయన ప్రస్తావించినట్లు తెలుస్తోంది.

Next Story