- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Phone Tapping Case: విచారణ అనంతరం MLC నవీన్ ఫస్ట్ రియాక్షన్
ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ రావు ఇవాళ విచారణకు హాజరయ్యారు.

దిశ, వెబ్‌డెస్క్: ఫోన్ ట్యాపింగ్ కేసు(Phone Tapping Case)లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ రావు(MLC Naveen Rao) ఇవాళ విచారణకు హాజరయ్యారు. విచారణ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘2024 సెప్టెంబర్‌లో పిలిస్తే విచారణకు హాజరయ్యాను.. అప్పుడు దాదాపు 3 గంటలు విచారించారు. ఇప్పుడు కూడా అదే విషయంలో పిలిస్తే విచారణకు వచ్చాను. విచారణ పూర్తిగా సహకరించాను. బయట ప్రచారం అవుతున్నట్టు ఎలాంటి మెటీరియల్ సరఫరా గురించి విచారణలో చర్చకు రాలేదు. నేతలు, వ్యక్తులతో సంబంధాల గురించి అడిగారు. సంబంధించిన పూర్తి వివరాలు చెప్పాను. సెప్టెంబర్ 24న ఏదైతే చెప్పానో.. ఇవాళ కూడా అదే చెప్పాను. అవే విషయాలు అడిగారు. నేను పరికరాలు సమకూర్చాననే విషయం చర్చకు రాలేదు’ అని నవీన్ రావు స్పష్టం చేశారు. కాగా, ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రత్యేక పరికరాలు(డివైజ్‌లు)లు ఉపయోగించి.. అప్పటి ప్రతిపక్షనేతలు, వారి కుటుంబ సభ్యుల ఫోన్లు ట్యాప్ చేయించారంటూ నవీన్ రావుపై ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే.






