ఫోన్ ట్యాపింగ్ కేసు.. సిట్ విచారణకు హాజరైన KCR మాజీ ఓఎస్డీ

by Kema Shiva Kumar |   (  Updated:2025-11-27 08:49:29  IST  )

రెండు తెలుగు రాష్ట్రాలను షేక్ చేసిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.

ఫోన్ ట్యాపింగ్ కేసు.. సిట్ విచారణకు హాజరైన KCR మాజీ ఓఎస్డీ
X

దిశ, వెబ్‌డెస్క్: రెండు తెలుగు రాష్ట్రాలను షేక్ చేసిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఈ మేరకు మాజీ సీఎం కేసీఆర్‌కు అప్పట్లో ఓఎస్డీగా పనిచేసిన రాజశేఖర్ రెడ్డిని సిట్ అధికారులు నోటీసులు ఇవ్వగా, ఆయన ఇవాళ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు విచారణ నిమిత్తం హాజరయ్యారు. దాదాపు 2 గంటల పాటు సిట్ అధికారులు రాజశేఖర్ రెడ్డిని విచారించి, ఆయన ఇచ్చిన స్టేట్‌మెంట్‌ను ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎన్‌క్లోజ్ చేశారు. ఇదే కేసులో విదేశాల నుంచి వచ్చిన ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావును సిట్ అధికారులు సుదీర్ఘంగా విచారించారు. అయినప్పటికీ ఆయన సరైన సమాచారం ఇవ్వకపోవడంతో విచారణకు సహకరించడం లేదని, అరెస్ట్ నుంచి మినహాయింపు ఆర్డర్లను కొట్టివేయాలని సుప్రీంకోర్టులో ఇప్పటికే పిటిషన్ దాఖలు చేయగా విచారణ కొనసాగుతోంది.

కాగా, 2023 నవంబర్ 15 నుంచి 30 వరకు సుమారు 4,013 ఫోన్ నంబర్లను ట్యాపింగ్ చేసినట్లు సిట్ నిర్ధారించింది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక, గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ప్రధానంగా దృష్టి పెట్టింది. ఇప్పటికే కేసులో కీలక నిందితులతో పాటు ఫోన్ ట్యాపింగ్‌కు గురైన పలువురు రాజకీయ ప్రముఖులు, సినీ ప్రముఖులు, జర్నలిస్టుల స్టేట్‌మెంట్లను సిట్ రికార్డు చేసిన విషయం తెలిసిందే.

Next Story