- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TG News : ఫోన్ ట్యాపింగ్ కేసు... రేపు సిట్ ముందుకు బీజేపీ నేతలు
తెలంగాణలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ కేసు(Phone Taping Case)లో ముగ్గురు రాష్ట్ర బీజేపీ ఎంపీలకు సిట్(SIT) నుంచి పిలుపులు అందాయి.

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ కేసు(Phone Taping Case)లో ముగ్గురు రాష్ట్ర బీజేపీ ఎంపీలకు సిట్(SIT) నుంచి పిలుపులు అందాయి. బీజేపీకి చెందిన ఈటల రాజేందర్(Eatala Rajendar), ధర్మపురి అరవింద్(Dharmapuri Aravind), రఘునందన్ రావు(Raghunandan Rao)ల ఫోన్లతో పాటు వారి ముఖ్య అనుచరులు, కుటుంబ సభ్యుల ఫోన్లను కూడా ట్యాప్ చేసినట్లు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) గుర్తించింది. ఈ కేసులో ఈ ముగ్గురు బీజేపీ నేతలు సిట్ ముందు హాజరయ్యి వారి వాంగ్మూలం ఇవ్వాలని సిట్ కోరింది. ఈ నేపథ్యంలో రేపు ఈ నేతలు సిట్ ముందు హాజరు కానున్నారు.
అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో(SIB) మాజీ చీఫ్ టి. ప్రభాకర్ రావు ఈ ట్యాపింగ్ ఆపరేషన్‌ను నడిపినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆయన బీజేపీ నేతల రాజకీయ ప్రణాళికలు, ఆర్థిక సహాయం అందించే వ్యక్తుల గురించి సమాచారం సేకరించి, ఈ వివరాలను అడిషనల్ ఎస్పీ భుజంగరావుకు చేరవేశారని, భుజంగరావు ఈ సమాచారాన్ని బీజేపీ నేతల నియోజకవర్గాల్లోని బీఆర్ఎస్ నాయకులకు ఇచ్చి, రాజకీయంగా ఎదుర్కొనేందుకు ఉపయోగించారని సిట్ విచారణలో తేలింది.
ఈ కేసులో ప్రభాకర్ రావు, భుజంగరావు, డీఎస్పీ ప్రణీత్ కుమార్‌లతో పాటు ఇతర పోలీసు అధికారులు కూడా పాల్గొన్నట్లు పోలీసులు ఆధారాలు సేకరించారు. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈ ట్యాపింగ్ జరిగినట్లు, అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్(KCR) ఆదేశాలతోనే ఈ ఆపరేషన్ నడిచినట్లు భుజంగరావు తన కన్ఫెషన్ స్టేట్‌మెంట్‌లో తెలిపారని సమాచారం.






