ఫోన్ ట్యాపింగ్ కేసు.. నేడు సిట్ ముందుకు బండి సంజయ్

by Kema Shiva Kumar |

ఫోన్ ట్యాపింగ్ కేసులో నేడు సిట్ ఎదుటకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ హాజరు కానున్నారు.

ఫోన్ ట్యాపింగ్ కేసు.. నేడు సిట్ ముందుకు బండి సంజయ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఫోన్ ట్యాపింగ్ కేసులో నేడు సిట్ ఎదుటకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ హాజరు కానున్నారు. ఈ కేసుకు సంబంధించి ఆయన పూర్తి అధ్యయనం చేస్తూ.. ఆధారాలు సైతం సేకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో గురువారం కేంద్ర హోంశాఖ అధికారులతో హైదరాబాద్‌లో భేటీ అయ్యారు. ఉమ్మడి ఏపీ, తెలంగాణకు చెందిన మాజీ పోలీసు ఉన్నతాధికారులు, ఎస్‌ఐబీ, సిట్, కౌంటర్​ఇంటలిజెన్స్​విభాగాల్లో పని చేసిన అధికారులు సైతం పాల్గొన్నారు. ప్రధానంగా బండి సంజయ్‌ ఫోన్‌ ట్యాపింగ్‌ విషయంపై చర్చించినట్టు తెలిసింది.

బండి సంజయ్ ఫోన్లే అత్యధికంగా ట్యాప్

కేసీఆర్​ప్రభుత్వ హయాంలో బండి సంజయ్​ఫోన్లనే​అత్యధికంగా ట్యాప్​చేసినట్టు నిర్ధారించిన నిఘా వర్గాలు వాటికి సంబంధించిన ఆధారాలను సేకరించి ఆయన ముందు ఉంచాయి. ఫోన్​ట్యాపింగ్‌లో సిట్​ఎదుట హాజరవుతున్న తొలి కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్​కావడం గమనార్హం. మరో వైపు ఈ ఇష్యూను బీజేపీ జాతీయ స్థాయి అంశంగా పరిగణిస్తోంది. గతంలో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో బీజేపీ జాతీయ నేత బీఎల్​సంతోష్​ఫోన్‌ను సైతం ట్యాప్​చేశారని అనుమానిస్తున్నారు. ఈ కేసును సీబీఐ ద్వారా విచారణ జరిపించాలని బీజేపీ డిమాండ్​ చేస్తోంది. ఈ అంశంపై దిల్​కుషా గెస్ట్‌హౌజ్​వద్ద నిరసన చేపట్టేందుకు కాషాయ పార్టీ కార్యకర్తలు సిద్ధమయ్యారు.

విచారణకు సంజయ్ వ్యక్తిగత సిబ్బంది సైతం

ఫోన్​ట్యాపింగ్​కేసులో గత నెల 24న విచారణకు హాజరుకావాలని బండి సంజయ్‌కు సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. పార్లమెంటు​సమావేశాలు ఉన్న కారణంగా విచారణకు హాజరుకాలేనని బండి సంజయ్ సిట్‌కు సమాచారం అందించారు. ఈ క్రమంలో ముందస్తు అనుమతితో నేడు హాజరు కానున్నారు. బండి సంజయ్‌తో పాటు ఆయన వ్యక్తిగత సిబ్బంది సైతం విచారణకు హాజరుకానున్నారు. వాళ్ల ఫోన్లు సైతం కేసీఆర్​ప్రభుత్వం ట్యాపింగ్​చేసిందని గుర్తించారు.

Next Story