పీజీఈసెట్ రెండో విడత సీట్ల కేటాయింపు విడుదల.. ఈ నెల 9 లోగా కాలేజీల్లో రిపోర్ట్‌కు ఛాన్స్

by Ramesh Naini |

2025-26 విద్యా సంవత్సరానికి గాను రాష్ట్రంలో ఎంఈ, ఎంటెక్, తదితర కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి పీజీఈసెట్ 2025 కౌన్సిలింగ్‌లో భాగంగా రెండో విడత సీట్ల కేటాయింపు విడుదల అయింది.

పీజీఈసెట్ రెండో విడత సీట్ల కేటాయింపు విడుదల.. ఈ నెల 9 లోగా కాలేజీల్లో రిపోర్ట్‌కు ఛాన్స్
X

దిశ, తెలంగాణ బ్యూరో: (TG PGECET 2025) 2025-26 విద్యా సంవత్సరానికి గాను రాష్ట్రంలో ఎంఈ, ఎంటెక్, ఆర్కిటెక్చర్ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి పీజీఈసెట్ 2025 కౌన్సిలింగ్‌లో భాగంగా రెండో విడత సీట్ల కేటాయింపు విడుదల అయింది. ఈ వివరాలను మంగళవారం టీజీ సెట్స్ అడ్మిషన్స్ 2025 కన్వీనర్, ప్రొఫెసర్ జె. పాండురంగ రెడ్డి(J. Panduranga Reddy), ఉస్మానియా యూనివర్సిటీ ప్రాంగణంలోని కార్యాలయం నుండి విడుదల చేశారు. కన్వీనర్ కోటా కింద మొత్తం 3345 సీట్లు అందుబాటులో ఉండగా, మొత్తం 5370 మంది అభ్యర్థులు వెబ్ ఆప్షన్లను వినియోగించుకున్నారు. వీరిలో 2926 మంది అభ్యర్థులకు సీట్లు కేటాయించారు. సీట్లు పొందిన విద్యార్థులు తప్పనిసరిగా ట్యూషన్ ఫీజును ఆన్‌లైన్ ద్వారా క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ లేదా నెట్ బ్యాంకింగ్ ఉపయోగించి చెల్లించాలి.

ఫీజు చెల్లించిన తర్వాత, విద్యార్థులు ట్యూషన్ ఫీజు రసీదు, జాయినింగ్ రిపోర్ట్ లను డౌన్‌లోడ్ చేసుకోవాలి. అభ్యర్థులు ఈ నెల 7 నుంచి 9 లోగా కేటాయించిన కళాశాలకు వెళ్లి, అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్స్‌తో రిపోర్ట్ చేయాలి. రిపోర్టింగ్ సమయంలో ట్యూషన్ ఫీజు రసీదు, జాయినింగ్ రిపోర్ట్‌ను కూడా వెంట తీసుకెళ్లాలి. ఒరిజినల్ సర్టిఫికెట్ల ధృవీకరణ పూర్తయిన తర్వాత, కళాశాలలో ప్రొవిజనల్ అలాట్‌మెంట్ ఆర్డర్ అందజేస్తారు.

రెండో విడత సీట్ల కేటాయింపు వివరాలు:

Next Story