పీజీ మెడికల్ సీట్ల రిపోర్టింగ్ గడువు పొడిగింపు

by Gantepaka Srikanth |

పీజీ మెడికల్ సీట్ల రిపోర్టింగ్ గడువు పొడిగింపు

పీజీ మెడికల్ సీట్ల రిపోర్టింగ్ గడువు పొడిగింపు
X

దిశ, తెలంగాణ బ్యూరో: కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ (కేఎన్‌ఆర్‌యూహెచ్‌ఎస్) పరిధిలో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి పీజీ మెడికల్ డిగ్రీ, డిప్లొమా కోర్సుల్లో స్టేట్ కోటా కింద ఫేజ్-1 కౌన్సెలింగ్‌లో సీట్లు పొందిన అభ్యర్థులకు రిపోర్టింగ్ గడువును యూనివర్సిటీ పొడిగించింది. ఈ మేరకు ఇప్పటికే ఈ నెల 14న జారీ చేసిన నోటిఫికేషన్‌కు కొనసాగింపుగా, కేటాయించిన మెడికల్ కాలేజీల్లో రిపోర్ట్ చేయాల్సిన చివరి తేదీని ఈ నెల 18 సాయంత్రం 4 గంటల నుంచి ఈ నెల 21 సాయంత్రం 4 గంటల వరకు పొడిగిస్తున్నట్లు కేఎన్‌ఆర్‌యూహెచ్‌ఎస్ స్పష్టం చేసింది. అభ్యర్థులు తప్పనిసరిగా డిసెంబర్ 21 సాయంత్రం 4 గంటలలోపు తమకు కేటాయించిన కళాశాలలో హాజరై, అవసరమైన అన్ని సర్టిఫికెట్లు, బాండ్లు, కాలేజీ ఫీజు చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది. నిర్ణీత గడువులో రిపోర్ట్ చేయకపోతే కేటాయించిన సీటు ఆటోమేటిక్ గా రద్దు అవుతుందని యూనివర్సిటీ హెచ్చరించింది. అలాగే అన్ని మెడికల్ కాలేజీల ప్రిన్సిపల్స్ రిపోర్ట్ చేసిన అభ్యర్థుల వివరాలను డిసెంబర్ 21 సాయంత్రం 4:30 గంటలలోపు యూనివర్సిటీ పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలని ఆదేశించింది.

Next Story