- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Secunderabad: పెట్రోల్ ట్యాంకర్ బోల్తా.. తప్పిన పెను ప్రమాదం
సికింద్రాబాద్ రైలు నిలయానికి సమీపంలోని ఆలుగడ్డ బావి వద్ద సోమవారం ఉదయం పెట్రోల్ ట్యాంకర్ లారీ బోల్తా పడింది.

దిశ, తెలంగాణ బ్యూరో: సికింద్రాబాద్ రైలు నిలయానికి సమీపంలోని ఆలుగడ్డ బావి వద్ద సోమవారం ఉదయం పెట్రోల్ ట్యాంకర్ లారీ బోల్తా పడింది. వెంటనే స్పందించిన ట్రాఫిక్ పోలీసులు, హైడ్రా, డీఆర్‌ఎఫ్ బృందాలు రంగంలోకి దిగారు. ట్రాఫిక్‌ను దారి మళ్లించి ప్రమాదం లేకుండా చర్యలు తీసుకున్నారు. ఏమాత్రం అజాగ్రత్తగా వ్యవహరించినా ట్యాంకర్ పేలి పెను ప్రమాదం జరిగే అవకాశముందని అధికారులు గుర్తించారు. ట్యాంకర్ నుంచి లీకైన పెట్రోల్, డీజిల్‌కు మంటలు అంటుకోకుండా ఫైర్ ఇంజిన్ల ద్వారా ఫైర్, డీఆర్ఎఫ్ బృందాలు నిరంతరాయంగా నీళ్లు చల్లాయి. ఫోమ్‌ను వెదచల్లి, ఇసుక పోసి మంటలు వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. భారీ క్రేన్లతో ఎక్కడా స్పార్క్ రాకుండా ట్యాంకర్‌ను నిలబెట్టారు. ఎలాంటి ప్రమాదానికి ఆస్కారం లేకుండా గంటలో పని పూర్తి చేశారు. దీంతో ట్రాఫిక్ సమస్యతోపాటు ఏలాంటి ప్రమాదం చోటుచేసుకోండా చాకచక్యంగా వ్యవహరించారు.






