- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏపీలో 'పెట్రో' షాక్.. రూ.120 దాటిన ధర
దిశ, వెబ్‌డెస్క్: పెట్రోల్ ధరలకు బ్రేక్ లు పడటం లేదు. రోజురోజుకి ధరలు పెరిగిపోతున్నాయి. పెరుగుతున్న పెట్రోల్ ధరలతో

X
దిశ, వెబ్‌డెస్క్: పెట్రోల్ ధరలకు బ్రేక్ లు పడటం లేదు. రోజురోజుకి ధరలు పెరిగిపోతున్నాయి. పెరుగుతున్న పెట్రోల్ ధరలతో వాహనదారులతో పాటు నిత్యావసరాల ధరలు కూడా పెరగడంతో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు. ఇవాళ కూడా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. తెలంగాణలో లీటర్ పెట్రోల్ పై 91 పైసలు, డీజిల్ పై 87 పైసలు పెంచింది. ఈ పెంపుతో హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర రూ.118.59, డీజిల్ ధర రూ.104.62కి చేరుకుంది. ఇక ఏపీలో లీటర్ పెట్రోల్ పై 88 పైసలు, డీజిల్ పై 84 పైసలు పెరిగింది. దీంతో గుంటూరులో లీటర్ పెట్రోల్ ధర రూ.120.38, డీజిల్ ధర రూ.106.04గా ఉంది. విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర రూ.120.18కి చేరుకోగా.. డీజిల్ రూ.105.84కి చేరుకుంది.
Next Story






