- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సర్పంచ్ ఎన్నికల రిజర్వేషన్లపై హైకోర్టులో పిటిషన్లు.. రేపే విచారణకు
సర్పంచ్ ఎన్నికల రిజర్వేషన్ల విషయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది.

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలకు (Sarpanch Elections) ఎస్ఈసీ నోటిఫికేషన్ జారీ చేసిన వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లను (Local Body Reservations) సవాలు చేస్తూ హైకోర్టులో (Telangana High Court) పిటిషన్లు దాఖలయ్యాయి. బీసీ జనాభా ఆధారంగా రిజర్వేషన్లు కేటాయించలేదంటూ పలువురు గ్రామస్థుల ఇవాళ పిటిషన్లు దాఖలు చేశారు. వెల్దండ తిమ్మనోనిపల్లి వార్డుల రిజర్వేషన్ల ఖరారుపై, వరంగల్, సంగారెడ్డి జిల్లాలోని గ్రామాల్లోనూ రిజర్వేషన్లను సవాలు చేస్తూ పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై హైకోర్టు రేపు విచారణ జరపనుంది. అయితే ఎన్నికల సంఘం ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం రేపటి నుంచి నామినేషన్ల స్వీకరణ కొనసాగనున్న వేళ హైకోర్టు నిర్ణయం ఉత్కంఠ రేపుతోంది. బీసీల రిజర్వేషన్ల (BC Reservations) విషయంలో ప్రభుత్వం బీసీలను మోసం చేసిందని ఇటు బీసీ సంఘాలు అటు ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్న వేళ హైకోర్టులో ఈ పిటిషన్లు దాఖలు కావడం హాట్ టాపిక్‍గా మారింది.






