జోక్యం చేసుకోలేము.. GHMC డీలిమిటేషన్‌పై దాఖలైన పిటిషన్లు కొట్టివేత

by Ramesh Naini |   (  Updated:2025-12-22 13:14:51  IST  )

జీహెచ్‌ఎంసీ (గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్) డీలిమిటేషన్‌పై దాఖలైన పిటిషన్లను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది.

జోక్యం చేసుకోలేము.. GHMC డీలిమిటేషన్‌పై దాఖలైన పిటిషన్లు కొట్టివేత
X

దిశ, డైనమిక్ బ్యూరో: జీహెచ్‌ఎంసీ (గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్) డీలిమిటేషన్‌పై దాఖలైన పిటిషన్లను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. ఇవాళ విచారణ జరిపిన న్యాయస్థానం జీహెచ్‌ఎంసీ డీలిమిటేషన్‌ ( వార్డుల పునర్విభజన) విభజనలో జోక్యం చేసుకోలేమని హైకోర్టు వెల్లడించింది. ఇటీవల వార్డుల విభజన అభ్యంతరాలపై హైకోర్టులో 80కి పైగా పిటిషన్లు దాఖలయ్యాయి. అభ్యంతరాల గడువు పూర్తైనందున పిటిషన్ల విచారణను హైకోర్టు ముగించింది. కాగా, GHMC పరిధిలో చేపట్టిన వార్డుల పునర్విభజన అసంబద్ధంగా, ఏకపక్షంగా జరిగిందని ఆరోపిస్తూ హైకోర్టులో పిటిషన్లు వేశారు. నగర శివార్లలోని 20 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్‌ల విలీనంతో దాదాపు 2 వేల చదరపు కిలోమీటర్ల వరకు పెరిగిన గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ)ను పరిపాలన సౌలభ్యం కోసం 300 వార్డులుగా విభజించిన విషయం తెలిసిందే.

Next Story