- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
AEE Nikesh Kumar: ఏఈఈ నిఖేశ్ కుమార్ ను కస్టడీకి కోరుతూ ఏసీబీ పిటిషన్
నిఖేశ్ కుమారు ఆదాయనికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ దూకుడు పెంచింది.

దిశ, డైనమిక్ బ్యూరో: నీటిపారుదల శాఖ ఏఈఈ నిఖేశ్ కుమార్ (AEE Nikesh Kumar) అక్రమార్జన కేసులో ఏసీబీ (ACB) స్పీడ్ పెంచింది. నిఖేశ్ కుమార్ ను వారం రోజులపాటు కస్టడీకి ఇవ్వాలని ఏసీబీ కోరింది. ఈ మేరకు ఏసీబీ అధికారులు దాఖలు చేసిన కస్టడీ పిటిషన్ పై ఏసీబీ కోర్టు సోమవారం విచారించనున్నది. ఈ కేసులో ఇప్పటికే నిఖేశ్ కుమార్ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ బెయిల్ పిటిషన్ పైనా ఏసీబీ కౌంటర్ దాఖలు చేసింది. ఇటీవల నిఖేశ్ కుమార్, ఆయన బంధువుల ఇళ్లపై సోదాలు చేపట్టిన ఏసీబీ ఆదాయనికి మించిన ఆస్తులు ఉన్నట్లు గుర్తించి కేసు నమోదు చేశారు. అనంతరం నిఖేశ్ కుమార్ ను అరెస్టు చేసి నాంపల్లి కోర్టులో (Nampally court) హాజరుపరుచగా ఆయనకు కోర్డు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. దాంతో ఏసీబీ అధికారులు ఆయన్ను చంచల్ గూడా జైలుకు తరలించారు. కాగా భారీ ఎత్తున అక్రమాలకు పాల్పడిన నిఖేశ్ కుమార్ ను లోతుగా విచారిస్తే ఆయన వెనుక ఉన్న మరి కొంత మంది కీలక అధికారుల బాగోతం సైతం బయటకు వస్తుందనే టాక్ వినిపిస్తున్నది. ఈ నేపథ్యంలో నిఖేశ్ ను కస్టడీకి కోరడంతో ఈ కేసు మరింత ఉత్కంఠగా మారింది.






