- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
BC Reservations: బీసీ రిజర్వేషన్లపై మళ్లీ హైకోర్టులో పిటిషన్.. కోర్టు నిర్ణయంపై ఉత్కంఠ
బీసీ రిజర్వేషన్ల జీవో విషయంలో అంతా అనుకున్నట్లే జరుగుతోందా?

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో స్థానిక సంస్థల విషయంలో అనుకున్నదే జరిగిందా?.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్ 9 జారీ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ జీవోను సవాల్ చేస్తూ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మూడుచింతలపల్లి మండలం కేశవాపూర్ గ్రామానికి చెందిన బుట్టెంగారి మాధవరెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై హౌస్ మోషన్ పిటిషన్ కు అనుమతి ఇవ్వాలని కోరగా ప్రస్తుతం ఇది హైకోర్టు రిజిస్ట్రీ పరిశీలనలో ఉంది. బీసీలకు రిజర్వేషన్ల విషయంలో జీవో జారీ కావడంతో రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు ఏ క్షణంలోనైనా నోటిఫికేషన్ షెడ్యూల్ విడుదల కాబోతున్నదనే చర్చ జరుగుతున్న వేళ బీసీ రిజర్వేషన్ల జీవోపై హైకోర్టులో పిటిషన్ దాఖలు కావడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది.
ఇదిగో ఆధారం:
స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు బీసీలకు కేటాయించడం సరికాదంటూ మాధవరెడ్డి దాఖలు చేసిన పిటిషన్ ను ఈ నెల 24వ తేదీన హైకోర్టు కొట్టివేసింది. బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం ఏదైనా ఆర్డర్ ఇచ్చిందా? ఏ ఆధారంగా ఈ పిటిషన్ వేశారని హైకోర్టు సీరియస్ అయింది. వివిధ పేపర్లలో వచ్చిన కథనాల ఆధారంగా పిటిషన్లు వేయడం ఏంటి? మీడియా వార్తల ఆధారంగా పిటిషన్లు వేయడం సరికాదని పిటిషనర్‍పై ధర్మాసనం మండిపడింది. అయితే బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో జారీ చేయడంతో ఈ జీవోను సవాల్ చేస్తూ మాధవరెడ్డి మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. ఈసారి ప్రభుత్వం ఇచ్చిన జీవో అంశాన్ని కోర్టు దృష్టికి తీసుకువెళ్లనున్నారు. బేస్ లెస్ గా వచ్చారంటూ గత పిటిషన్ ను కొట్టేసిన హైకోర్టు ఈసారి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నది అనేది రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది.
మంత్రులు ప్లీజ్ అన్నా కోర్టుకు..
స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభుత్వం బీసీలకు కల్పించిన రిజర్వేషన్ కోటాకు వ్యతిరేకంగా ఎవరు కోర్టుకు వెళ్లవద్దని మంత్రులు పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ విషయంలో కొందరు కోర్టుకు వెళ్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. దయచేసి బీసీలకు జరుగుతున్న మంచిని అడ్డుకోవద్దని ఇవాళ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఓ వైపు మంత్రులు విజ్ఞప్తులు చేస్తున్నా మరోవైపు ఈ అంశంలో హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీంతో జీవో ఆధారంగా రిజర్వేషన్ల విషయంలో అంతా అనుకున్నదే జరుగుతోందా అనే చర్చ వినిపిస్తోంది. జీవో ఆధారంగా ప్రభుత్వం రిజర్వేషన్లు అమలు చేస్తే కోర్టులో సవాల్ చేసే అవకాశం ఉందని ప్రతిపక్షాలు చాలా కాలంగా ఆరోపిస్తున్నాయి. ఈ విషయంలో ప్రభుత్వం కోర్టుకు వెళ్లకూడదని అడగటం ఏంటని ప్రతిపక్షాలు ప్రభుత్వన్ని ప్రశ్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మొత్తంగా ఈ వ్యవహారం కోర్టుకు చేరడంతో ఏం జరగబోతోంది? స్థానిక సంస్థల ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ వస్తుందా లేక బ్రేకులు పడతాయా అనేది చూడాలి.
Read More: తెలంగాణలో BC రిజర్వేషన్ల జీవో విడుదల






