- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Telangana Thalli : తెలంగాణ తల్లి విగ్రహమార్పుపై హైకోర్టులో పిటిషన్
తెలంగాణ తల్లి విగ్రహం(Telangana Thalli statue)మార్పు వివాదం హైకోర్టు(High Court)కు చేరింది.

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ తల్లి విగ్రహం(Telangana Thalli statue)మార్పు వివాదం హైకోర్టు(High Court)కు చేరింది. విగ్రహ రూపం మార్చకుండా ఉత్తర్వులు ఇవ్వాలని హైకోర్టులో తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ (Juluru Gowri Shankar) పిటీషన్(Petition)వేశారు. డిసెంబర్ 9న సెక్రటేరియట్‌లో జరగనున్న విగ్రహావిష్కరణను ఆపాలని జూలూరు గౌరీశంకర్ కోరారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఉన్న తెలంగాణ తల్లి విగ్రహాలను మార్చకుండా చూడాలని కోర్టును కోరారు. మరోవైపు డిసెంబర్ 9 రాష్ట్ర సచివాలయం ఆవరణలో సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది.
మాజీ సీఎం కేసీఆర్ సహా కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ లకు కూడా ప్రభుత్వం ఆహ్వానం పలికింది. ఈ సమయంలో విగ్రహం ఏర్పాటుపై హైకోర్టులో దాఖలైన పిటిషన్ పట్ల కోర్టు ఏ విధంగా స్పందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న తెలంగాణ తల్లి విగ్రహం గత బీఆరెఎస్ ప్రభుత్వం హాయంలో ఏర్పాటు చేసిన విధంగా లేదంటూ ఇప్పటికే బీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.






