మంత్రి హరీష్ రావుపై పేర్నినాని సంచలన వ్యాఖ్యలు

by Disha Web Desk 4 |
మంత్రి హరీష్ రావుపై పేర్నినాని సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: మంత్రి హరీష్ రావు‌పై ఏపీ మాజీ మంత్రి పేర్నినాని సంచలన వ్యాఖ్యలు చేశారు. కుట్రలు, కుతంత్రాలు, హరీష్ రావుకు బాగా తెలుసన్నారు. ఎన్టీఆర్ అమాయకుడు కాబట్టి చంద్రబాబును నమ్మాడని.. కేసీఆర్ గట్టివాడు కాబట్టి హరీష్ రావును నమ్మలేదన్నారు. హరీష్ రావు ఇచ్చే సర్టిఫికెట్లు మాకు అవసరం లేదన్నారు. అయితే హరీష్ రావు ఏపీ నేతలను ఉద్దేశించి ఏపీ నేతల మాటలు కోటలు దాటుతాయని, చేతలు మాత్రం తక్కువే అన్నారు. ఏపీకి చెందిన ఇద్దరు నేతల కారణంగా రాష్ట్రం బొక్కబోర్లా పడిందన్నారు. ఏపీ, గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటకకు వెళ్లి చూస్తే తెలంగాణ గొప్పతనం తెలుస్తుందన్నారు. ఈ వ్యాఖ్యలపై పేర్ని నాని ఫైర్ అయ్యారు.



Next Story

Most Viewed