- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణలోని అన్ని గవర్నమెంట్ మెడికల్ కాలేజీలకు అనుమతులు జారీ
తెలంగాణలోని అన్ని గవర్నమెంట్ మెడికల్ కాలేజీలకు అనుమతులు జారీ

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో సీట్ల కోసం ఎదురుచూస్తున్న వారికి ఆందోళన తప్పింది. ప్రభుత్వం వెను వెంటనే తీసుకుంటున్న చర్యల కారణంగా ప్రభుత్వ కాలేజీలకు ఎలాంటి జరిమానా విధించకుండానే ఈ సంవత్సరం పర్మిషన్ ఇచ్చింది.
అధికారుల డిక్లరేషన్తో ముందడుగు..
తెలంగాణలోని కాలేజీలలో నెలకొన్న అధ్యాపకుల కొరత, ల్యాబ్ పరికరాలు ఇతర సౌకర్యాల లేమి కారణంగా నేషనల్ మెడికల్ కమిషన్ రాష్ట్రంలోని పలు ప్రభుత్వ వైద్య కళాశాలకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. దీనిపై కీలక సమావేశాలు నిర్వహించిన వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తీసుకోవాల్సిన చర్యలపై హెల్త్ మినిస్టర్ తో పాటు సీఎం దృష్టికి కూడా తీసుకెళ్లారు. దీంతో వెంటనే చర్యలకు ఉపక్రమించిన రాష్ట్ర ప్రభుత్వం హెల్త్ సెక్రటరీ, మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ జూన్ 18న ఢిల్లీలో జరిగిన సమావేశంలో డిక్లరేషన్ ద్వారా ప్రభుత్వ వైద్య కళాశాలలో సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చింది. అందుకు అనుగుణంగా పెద్ద ఎత్తున పోస్టులు భర్తీ చేస్తూ, మరోవైపు కావాల్సిన అత్యాధునిక పరికరాలకు సైతం అనుమతి ఇవ్వడం... ఇక ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ విషయంలో ప్రపంచ బ్యాంకు నుండి రుణం తీసుకుని సమస్య పరిష్కరించాలని భావించిన నేపథ్యంలో.. సంతృప్తి చెందిన నేషనల్ మెడికల్ కమిషన్ ఈ సంవత్సరానికి ఎలాంటి జరిమానా విధించకుండానే అనుమతులు జారీ చేసినట్లు తెలుస్తోంది.






