బోరబండలో బండి సంజయ్ సభకు అనుమతి.. భారీగా కేంద్ర బలగాలు మోహరింపు

by Gantepaka Srikanth |

జూబ్లీహిల్స్‌లో నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.

బోరబండలో బండి సంజయ్ సభకు అనుమతి.. భారీగా కేంద్ర బలగాలు మోహరింపు
X

దిశ, వెబ్‌డెస్క్: జూబ్లీహిల్స్‌లో నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. బోరబండలో బండి సంజయ్‌(Bandi Sanjay) సభకు పోలీసులు అనుమతి ఇచ్చారు. బోరబండ సైట్‌-3లో సభకు అనుమతి ఇస్తూ గురువారం సాయంత్రం ఉత్తర్వుల జారీ చేశారు. దీంతో సభా ప్రాంగణంలో భారీ కేంద్ర బలగాలు మోహరించాయి. కాగా, అంతకుముందు బోరబండలో బండి సంజయ్‌ నిర్వహించబోయే సమావేశానికి పోలీసులు అనుమతి రద్దు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసుల తీరుపై బీజేపీ శ్రేణులు మండిపడ్డారు. తొలుత అనుమతిచ్చి రద్దు చేయడం ఏంటని మండిపడ్డారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ ఒత్తిడికి తలొగ్గడమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు సాయంత్రం బోరబండలో సమావేశం నిర్వహించి తీరుతామని.. పార్టీ శ్రేణులంతా పెద్ద ఎత్తున తరలిరావాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు. ఎన్నికల కమిషన్‌ నిష్పక్షపాతంగా వ్యవహరించాలని సూచించారు. బండి సంజయ్‌ సభకు ఆటంకాలు లేకుండా సహకరించాల్సిన బాధ్యత పోలీసులపై ఉందన్నారు.

Next Story