అన్ని ప్రభుత్వ వైద్య కళాశాలల అధ్యాపకులకు పెరిఫెరల్ మెడికల్ కాలేజ్ అలవెన్స్ అమలు చేయాలి

by Naga Rani Yarlagadda |

హైదరాబాద్ వెలుపల ఉన్న అన్ని ప్రభుత్వ వైద్య కళాశాలలకూ పెరిఫెరల్ మెడికల్ కాలేజ్ అలయవెన్స్ అమలు చేయాలని తెలంగాణ టీచింగ్..

అన్ని ప్రభుత్వ వైద్య కళాశాలల అధ్యాపకులకు పెరిఫెరల్ మెడికల్ కాలేజ్ అలవెన్స్ అమలు చేయాలి
X

దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్ వెలుపల ఉన్న అన్ని ప్రభుత్వ వైద్య కళాశాలలకూ పెరిఫెరల్ మెడికల్ కాలేజ్ అలయవెన్స్ అమలు చేయాలని తెలంగాణ టీచింగ్ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ (టీటీజీడీఏ) సీఎం రేవంత్ రెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహని కోరింది. ఈ మేరకు బుధవారం వారికి టీటీజీడీఏ లేఖ రాసింది. హైదరాబాద్‌లో పనిచేస్తున్న అధ్యాపకులకు లభించే హెచ్ఆర్ఏ 30శాతం అందని కారణంగా... జిల్లాల్లోని మెడికల్ కాలేజీల్లో పనిచేస్తున్న అధ్యాపకులు నెలకు సగటున రూ.30వేల వరకు తక్కువ జీతం పొందుతున్నారని టీటీజీడీఏ అధ్యక్షుడు డా. కిరణ్ బొల్లెపాక, ప్రధాన కార్యదర్శి డా. కిరణ్ మాదాల, ఉపాధ్యక్షులు డా.కిరణ్ ప్రకాష్, కోశాదికారి డా. రమేష్ వాపోయారు. ఈ తేడా పెరిఫెరల్ ప్రాంతాల్లో పని చేయడానికి అధ్యాపకుల్లో ఆసక్తి తగ్గించే విధంగా మారిందన్నారు. ఏపీ సహా అనేక రాష్ట్రాల్లో ఇప్పటికే గ్రామీణ ప్రాంతాలలో పనిచేస్తున్న వైద్యులకు ప్రత్యేక అలవెన్సులను అమలు చేస్తున్నాయన్నారు. తెలంగాణలో కూడా ఇదే విధంగా చర్యలు తీసుకోవాలని వారు కోరారు. తద్వారా అధ్యాపకులు గ్రామీణ ప్రాంతాల్లో సేవలందించడానికి ప్రోత్సాహం లభిస్తుందని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ వెలుపల మొత్తం 32 ప్రభుత్వ వైద్య కళాశాలలు ఉన్నాయని... వాటన్నిటిలో కళాశాలల అధ్యాపకులు ఇదే జీతం తేడాతో బాధపడుతున్నారని తెలిపారు.

Next Story