- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘స్థానిక’ ఎన్నికల్లో రిజర్వేషన్లు 50 శాతం మించొద్దు.. మహారాష్ట్రకు ‘సుప్రీం’ ఆదేశాలు
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో జోరుగా చర్చ జరుగుతున్న వేళ సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది.

దిశ, డైనమిక్ బ్యూరో: స్థానిక సంస్థల ఎన్నికల్లో (Local Body Election) రిజర్వేషన్లు 50 శాతం మించవద్దని (50 percent reservations) మహారాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. రిజర్వేషన్ కోటా పరిమితులను ఉల్లంఘిస్తే ఎన్నికలను నిలిపివేయాలని హెచ్చరించింది. ఓబీసీల రిజర్వేషన్ కోటా 27 శాతానికి పెంచుతూ జేకే బాంటియా కమిషన్ చేసిన సిఫార్సు నివేదిక చట్టబద్దతను ధర్మాసనం ప్రశ్నించింది. 2022కు ముందు ఉన్న పరిస్థితి ప్రకారం ఎన్నికలు నిర్వహించవచ్చని అంతే తప్ప రిజర్వేషన్లు 50 శాతం మించకుండా చూసుకోవాలని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‍మల్య బాగ్చిలతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. అయితే తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయడం ద్వారా రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు పేర్కొన్న 50 శాతం సీలింగ్ దాటిపోతోందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ విషయంలో ఇప్పటికే రాష్ట్ర హైకోర్టులో కేసు పెండింగ్‍లో ఉన్న క్రమంలో మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల సీలింగ్ పై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేయడం చర్చనీయాశంగా మారింది. కాగా మహారాష్ట్రలో వచ్చే జనవరి వరకు స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని గతంలో సుప్రీంకోర్టు ఈసీ అధికారులను ఆదేశించించింది.






