- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సర్పంచ్ ఎన్నికల్లో ప్రజల స్పందన అద్భుతం: కలెక్టర్
by Gantepaka Srikanth |
సర్పంచ్ ఎన్నికల్లో ప్రజల స్పందన అద్భుతం: కలెక్టర్

X
దిశ, వెబ్‌డెస్క్: నిర్మల్ జిల్లాలో మూడు దశల్లో నిర్వహించిన గ్రామ పంచాయతీ ఎన్నికలు(Sarpanch Elections) మొత్తం ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా ముగిసినట్లు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్(Collector Abhilasha Abhinav) తెలిపారు. ఎన్నికల ప్రక్రియను పకడ్బందిగా పూర్తిచేయడంలో భాగస్వాములైన అధికారులు, ఉద్యోగులు, సిబ్బందికి ఆయన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలు పెద్ద ఎత్తున ఓటు హక్కును వినియోగించుకోవడంతో ఎన్నికల ప్రక్రియ మరింత ప్రజాస్వామ్య పంథాలో సాగిందని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రజల స్పందనకు జిల్లా తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు. జిల్లాలోని 399 గ్రామ పంచాయతీలలో సర్పంచ్ ఎన్నికలు పూర్తయ్యాయని, మూడు దశల్లో సరాసరి 82.80 శాతం పోలింగ్ నమోదై మంచి విజయవంతమైన ఎన్నికలుగా నిలిచిందని కలెక్టర్ తెలిపారు.
Next Story






