- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాంగ్రెస్ సర్కారును ప్రజలు క్షమించరు.. మాజీ మంత్రి కేటీఆర్ హాట్ ట్వీట్
రాష్ట్రంలో కొత్త వాహనాలు కొనుగోలు చేయాలనుకునే వారికి రాష్ట్ర ప్రభుత్వం పిడుగు లాంటి వార్త చెప్పబోతోంది.

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో కొత్త వాహనాలు కొనుగోలు చేయాలనుకునే వారికి రాష్ట్ర ప్రభుత్వం పిడుగు లాంటి వార్త చెప్పబోతోంది. లైఫ్ ట్యాక్స్ (Lift Tax), ఇన్సూరెన్స్ పాలసీ ప్రీమియంతో పాటు కొత్తగా వాహనాలపై రోడ్డు భద్రతా సెస్ విధించాలని రవాణా శాఖ నిర్ణయిచింది. అదేవిధంగా ఆ ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి వర్గం కూడా ఆమోదం తెలిపింది. ఇక నుంచి వాహన రకాన్ని బట్టి కనిష్టంగా రూ.2వేల నుంచి గరిష్టంగా రూ.10 వేలు సెస్ విధించనున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబడుతూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘X’ వేదికగా సంచలన ట్వీట్ చేశారు.
రాష్ట్రంలో పెరుగుతోన్న రోడ్డు ప్రమాదాల నివారణకు రహదారి భద్రతా చర్యలు తీసుకోవాలని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు (Supreme Court) ఆదేశాలు జారీ చేసిందని గుర్తు చేశారు. కానీ, ఆ ఆదేశాలు అమలు చేయాల్సింది పోయి వాహన కొనుగోలుదారులపై భారం మోపడం సీఎం రేవంత్ రెడ్డి ప్రజా వ్యతిరేక పాలనకు నిదర్శనమని అన్నారు. రాష్ట్ర బడ్జెట్ నుంచి రోడ్డు సేఫ్టీకి నిధులు కేటాయించి భద్రతా ప్రమాణాలను పెంచకుండా ఇలా అమాయక ప్రజలపై భారం మోపడం హేయమని ధ్వజమెత్తారు. హైడ్రా (HYDRAA) వంటి దిక్కుమాలిన విధానాలతో ప్రభుత్వ ఆదాయాలకు గండికొట్టి, ఇప్పుడు ఆ లోటును పూడ్చలేక సామాన్య ప్రజలపై విరుచుకుపడటం దుర్మార్గమని ఫైర్ అయ్యారు. రహదారి భద్రతా సెస్ పేరిట ఒక్కో కొత్త వాహనం కొనుగోలుపై ఏకంగా రూ.2 వేల నుంచి రూ.10 వేల వరకు అదనపు భారం వేయడం పేద, మధ్యతరగతికి చెందిన ప్రజానీకాన్ని దగా చేయడమేనని అన్నారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా.. ఇవ్వాల్సిన గ్యారెంటీలను గాలికొదిలి, చివరికి ప్రజల నుంచే ముక్కు పిండి రూ.270 కోట్లు వసూలు చేసే కుట్ర చేస్తే కాంగ్రెస్ సర్కారును ప్రజలు క్షమించరని ఆగ్రహం వ్యక్తం చేశారు. పైసా పైసా కూడబెట్టుకుని, అప్పు చేసి మరీ వాహనం కొనుగోలు చేసే వారి జేబులు కొట్టే ఇలాంటి పన్నాగాలకు కాంగ్రెస్ సర్కారు ఇకనైనా స్వస్తి పలకాలి






