- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Vision Document: ప్రజల కేంద్రంగా తెలంగాణ విజన్ డాక్యుమెంట్ ఉంది: ఆనంద్ మహీంద్రా
స్పూర్తిదాయక విజన్ డాక్యుమెంట్ రూపొందించినందుకు, ఆ దార్శనికతకు సీఎం రేవంత్ రెడ్డికి ఆనంద్ మహీంద్రా అభినందనలు తెలిపారు.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్-2047 (Telangana Rising Vision Document 2047) చూస్తే నిపుణులు, తెలంగాణ ప్రజలు కలిసి రూపొందించిన పత్రంలా అనిపించిందని మహీంద్రా అండ్ మహీంద్రా చైర్మన్ ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) అన్నారు. యువత, మహిళలు, అభివృద్ధి అన్నీ ఈ డాక్యుమెంట్‍లో ఉన్నాయన్నారు. ఇవాళ భారత్ ఫ్యూచర్ సిటీలో గ్లోబల్ సమ్మిట్‍లో తెలంగాణ విజన్ డాక్యుమెంట్ రిలీజ్ సందర్భంగా మాట్లాడిన మహింద్రా.. తెలంగాణ రైజింగ్ విజన్ బ్లూప్రింట్ చూశానని, స్పూర్తిదాయక విజన్ డాక్యుమెంట్ రూపొందించినందుకు, ఆ దార్శనికతకు సీఎం రేవంత్ రెడ్డికి అభినందనలు తెలుపుతున్నానన్నారు. దీర్ఘకాలిక లక్ష్యాలతో డాక్యుమెంట్ రూపొందించారని చెప్పారు. స్కిల్ యూనివర్సిటీకి చైర్మన్‍గా ఉండాలని మొదట సీఎం నన్ను అడిగారు. ఇప్పటికే టెక్ మహీంద్ర యునివర్సిటీకీ చైర్మన్‍గా ఉన్నందున వద్దని చెప్పానన్నారు. కానీ సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యాలు విజన్ విన్నాక తిరస్కరించలేకపోయానన్నారు. నాలుగు దశాబ్దాల వ్యాపారవేత్తగా ఉన్న నాకు రేవంత్ ఓ సమఉజ్జీలా కనిపించారన్నారు. ఎంత డిజిటల్ అయినా, ఎంత ఏఐ వచ్చినా.. వ్యూమన్ టచ్ కు ఉన్న ప్రాధాన్యత వేరు అని ఆ స్కిల్ ను భర్తీ చేయడం ఎవరి తరం కాదన్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో మహిళలు నడుపుతున్న బ్యాటరీ పరిశ్రమ మాకు గర్వకారణం అని చెప్పారు.






