- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణ ప్రజలు కేసీఆర్ చేతలతో ఆశ్చర్యపోతున్నారు: ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
ప్రజలకు క్షమాపణ చెప్పి కేసీఆర్ అసెంబ్లీలో చర్చకు రావాలని అధికారంలో ఉంటేనే కేసీఆర్ సభకు వస్తారా? ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రశ్నించారు.

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రజలకు క్షమాపణ చెప్పి కేసీఆర్ అసెంబ్లీలో చర్చకు రావాలని అధికారంలో ఉంటేనే కేసీఆర్ సభకు వస్తారా? ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రశ్నించారు. ప్రజలు అందరూ కేసీఆర్ చేతలతో ఆశ్చర్యపోతున్నారని హేళన చేశారు. కృష్ణా జలాలపై దమ్ము, ధైర్యం ఉంటే అసెంబ్లీలో సమావేశం పెట్టమన్నారని , సమావేశం పెడితే కేవలం సంతకం పెట్టి రెండు నిమిషాల్లో కేసీఆర్ వెళ్లిపోయారని విమర్శించారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌లో శనివారం మాట్లాతుడూ తప్పులు, అవినీతి ఎక్కడ బయటపడుతాయో అని జంకుతున్నారన్నారు. అసెంబ్లీ సమావేశాలలో మాట్లాడానికి సమయం ఇచ్చినా కావాలనే గొడవ చేసి మాజీ మంత్రి హరీష్ రావు వాకౌట్ చేశారని ఆరోపించారు.
టీఆర్ఎస్ భవన్ లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెడుతున్నారని కాంగ్రెస్ అడిగే ప్రశ్నలకు, కవిత అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేక తోకముడిచి పారిపోయారని అన్నారు. కుటుంబ కథా చిత్రాన్ని రక్తి కట్టిస్తున్నారని ఆరోపించారు. అడిగిన ప్రతి ప్రశ్నలకు అవినీతి జరిగిందని వాస్తవం అని కవిత స్వయంగా చెపుతున్నారని తెలిపారు. స్వయంగా కేసీఆర్ కూతురు కవిత కృష్ణా జలాలపై అసెంబ్లీకి చర్చకు కేసీఆర్ రాకపోతే బీఆర్ఎస్ పార్టీని దేవుడు కూడా కాపాడలేడని అంటున్నదని తెలిపారు.
ఉపాధి హామీ పథకాన్ని నీరుగార్చే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఉపాధి హామీ పథకం పై మాట్లాడాల్సి వస్తుందనే బిఆర్ఎస్ నేతలు వాకౌట్ చేశారని ఆరోపించారు. మహాత్మా గాంధీ పేరు పథకం నుంచి తొలగించ వచ్చు కానీ ప్రజల గుండెల్లో నుంచి తీసివేయలేరని స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఇండియన్ కరెన్సీ పై ఉన్న మహాత్మా గాంధీ ఫోటో కూడా తొలగిస్తారేమో అని అనిపిస్తున్నదని అన్నారు. ఉపాధి హామీ పథకం పేరులో గాంధీ పేరును యధాతధంగా కొనసాగించాలని తెలిపారు. గాంధీ కుటుంబం పై విష ప్రచారం బీజేపీ నేతలు మానుకోవాలని మండి పడ్డారు.
బీఆర్ఎస్ సభ్యులు వాకౌట్ చేయడం దుర్మార్గం : ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య
ప్రతిపక్ష నాయకులు తప్పులు బయటపడతాయని వాకౌట్ చేయడం దుర్మార్గమైన చర్యఅని ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య ఆరోపించారు. మాట్లాడటానికి సమయం ఇవ్వాలని బీఏసీ సమావేశంలో అడిగి, తప్పులు బయటపడతాయని వాకౌట్ చేశారని విమర్శించారు. మూసి పునర్జీవనం చేద్దామని మంచి నిర్ణయం తీసుకుంటే చర్చకు రాదని ఏద్దేవా చేశారు. కేసీఆర్ ఫాం హౌస్‌కు పరిమితం అయ్యారని , ఆరు అడుగుల ఆజానుబాహుడు వాకౌట్ చేస్తున్నారని విమర్శించారు. ఉపాధి హామీ పథకంకు కేంద్రం చేస్తున్న నష్టం బిఆర్ఎస్ పార్టీకి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. గాంధీ కుటుంబం పేరు చెపితే మోడీకి వణుకు పడుతున్నదని అన్నారు. కమిషన్ల కక్కుర్తితో పాలమూరు రంగారెడ్డి ఎండబెట్టారని ఆరోపించారు. దమ్ము, ధైర్యం ఉంటే అసెంబ్లీలో కృష్ణా జలాలపై, పాలమూరు రంగారెడ్డి పై చర్చకు రావాలని సవాల్ విసిరారు.






