- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Good News: డయాలసిస్ పేషంట్లకు పించన్లపై ప్రభుత్వం గుడ్ న్యూస్
by Prasad Jukanti |
డయాలసిస్ పేషంట్లకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.

X
దిశ, డైనమిక్ బ్యూరో: డయాలసిస్ పేషంట్లకు తెలంగాణ ప్రభుత్వం తీపికబురు చెప్పింది. కొత్తగా మరో 681 మంది డయాలసిస్ పేషంట్లకు చేయూత పించన్లు మంజూరు చేసింది. ఈ మేరకు ఇవాళ మంత్రి సీతక్క (Seethakka) సంబంధింత ఫైల్ పై సంతకం చేశారు. గత ప్రభుత్వ హయాంలో 4011 మంది డయాలసిస్ పేషంట్లకు సామాజిక పించన్ ఉండగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక 4029 మంది డయాలసిస్ తో (Dialysis patients) ఇబ్బంది పడుతున్న వారికి చేయూత పించన్లు మంజూరు చేస్తోంది. ఈ క్రమంలో తాజాగా మరో 681 మందికి పించన్లు మంజూరు చేసింది. పలు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వీరు ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ ద్వారా ప్రభుత్వం గుర్తించింది. వెరిఫికేషన్ పూర్తి చేసి పించన్లు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కొత్త లబ్ధిదారులు వచ్చే ఆగస్టు నుంచి ఒక్కొక్కరు నెలకు రూ.2016 చొప్పున పించన్ అందుకోనున్నారు.
Next Story






