'పెండింగ్ డీఏ' ను వెంటనే విడుదల చేయాలి.. రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం డిమాండ్!

by Geesa Chandu |

కేంద్ర ప్రభుత్వం నిర్ణీత గడువులోగా కరువు భత్యం(డిఏ) ఇచ్చిన విధంగానే.. తమకు కూడా డీఏ మంజూరు చేయాలని, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను గురువారం రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం (ఎస్టీయూ టీఎస్) నాయకులు కలిసి విజ్ఞప్తి చేసారు.

పెండింగ్ డీఏ ను వెంటనే  విడుదల చేయాలి.. రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం డిమాండ్!
X

దిశ, వెబ్ డెస్క్: కేంద్ర ప్రభుత్వం నిర్ణీత గడువులోగా కరువు భత్యం(డిఏ) ఇచ్చిన విధంగానే.. తమకు కూడా డీఏ మంజూరు చేయాలని, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను గురువారం రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం (ఎస్టీయూ టీఎస్) నాయకులు కలిసి విజ్ఞప్తి చేసారు.పెరిగిన ధరలకు అనుగుణంగా, ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు డీఏ అందించాలని డిమాండ్ చేసారు. ఈ సందర్బంగా ఉపాధ్యాయ సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పర్వత రెడ్డి, సదానందం గౌడ్ లు మాట్లాడుతూ ..జులై 2022 నుండి రావాల్సిన నాలుగు విడతల 14.56 శాతం డీఏ మంజూరు చేయాల్సి ఉండగా.. ఉత్తర్వులు నేటికీ విడుదల చేయకపోవడం శోచనీయమని అన్నారు.

దీంతో పాటుగా ఉద్యోగ, ఉపాధ్యాయుల వేతన, ఇతర సప్లమెంటరీ బిల్లులు కూడా చాలా కాలం నుంచి పెండింగ్ లో ఉన్నాయన్నారు. ఉద్యోగుల జీతం నుంచి మినహాయించిన జీపీఎఫ్ నుండి అడ్వాన్సులు, పాక్షిక చెల్లింపుల బిల్లులు సైతం నెలల తరబడి పెండింగ్ పెట్టడం వల్ల, ఉపాధ్యాయులకు సకాలంలో డబ్బులు అందక ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే పై అంశాలను పరిశీలించి పెండింగ్ లో ఉన్న నాలుగు డిఏ లను మంజూరు చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పూర్వ రాష్ట్ర అధ్యక్షులు, శాసనమండలి సభ్యులు కత్తి నరసింహా రెడ్డి, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు కరుణాకర్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దాసరి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

Next Story