- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సీఎం రేవంత్‌రెడ్డితో శాంతి చర్చల కమిటీ నేతల సమావేశం
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో శాంతి చర్చల కమిటీ నేతలు సమావేశం అయ్యారు. జూబ్లిహిల్స్ నివాసంలో సీఎంను కలిసి వినతీపత్రం అందజేశారు.

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో శాంతి చర్చల కమిటీ నేతలు సమావేశం అయ్యారు. మావోయిస్టులతో కేంద్రం శాంతి చర్చలు జరిపేలా చొరవ తీసుకోవాలని రేవంత్ రెడ్డికి వినతీపత్రం అందజేశారు. సీఎంతో భేటీ అయినవారిలో ప్రొఫెసర్ హరగోపాల్, ప్రొఫెసర్ అన్వర్ ఖాన్, శాంతి చర్చల కమిటీ కన్వీనర్ జస్టిస్ చంద్రకుమార్, దుర్గా ప్రసాద్, రవిచందర్, జంపన్న ఉన్నారు. నక్సలైట్లతో చర్చలు జరిపిన అనుభవం సీనియర్ నేత జానారెడ్డికి ఉందని సీఎం వారికి తెలిపారు. ఈ అంశంపై జానారెడ్డి సలహాలు, సూచనలు తీసుకుంటామని మంత్రులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇదిలా ఉంటే కేంద్రం మావోయిస్టులను ఏరీవేస్తున్న సంగతి తెలిసిందే. మావోయిస్టుల స్థావరాలపై బలగాలు వరుస దాడులకు పాల్పడుతున్నాయి. ప్రతి దాడిలో 20 నుండి 30 మంది మావోయిస్టులు చనిపోతున్నారు. ఈ క్రమంలో శాంతి చర్చలు జరపాలని దాడులు చేయవద్దని పలువురు మేధావులు డిమాండ్ చేస్తున్నారు.






