- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ దాడుల్లో పీడీఎస్ రైస్ పట్టివేత
విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ కరీంనగర్ యూనిట్ చెపట్టిన దాడులలో రూ. 4.80 లక్షల విలువైన 160 క్వింటాళ్ల అక్రమ పీడీఎస్ బియ్యాన్ని బుధారం స్వాధీనం చేసుకున్నారు.

- 160 క్వింటాళ్ల పిడిఎస్ రైస్ పట్టివేత
- రూట్ చెకింగ్‌లో 16కేసులు నమోదు రూ.5లక్షల జరిమానా
దిశ, తెలంగాణ బ్యూరో : విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ కరీంనగర్ యూనిట్ చెపట్టిన దాడులలో రూ. 4.80 లక్షల విలువైన 160 క్వింటాళ్ల అక్రమ పీడీఎస్ బియ్యాన్ని బుధారం స్వాధీనం చేసుకున్నారు. నిర్మల్ మండలం చిట్యాల గ్రామం సమీపంలోని 'లక్ష్మీ నరసింహ మోడ్రన్ రైస్ మిల్' అనే మూతపడిన మిల్లుపై ఆకస్మిక దాడిలో ఈ నిల్వలను గుర్తించారు. తదుపరి కేసుల నమోదు కోసం నిర్మల్ జిల్లా పౌర సరఫరాల అధికారులకు అప్పగించారు. హైదరాబాద్ సిటీ-1 యూనిట్ ద్వారా గండి మైసమ్మ ఓఆర్ఆర్ , బాలానగర్ ఎక్స్ రోడ్ , పరిసర ప్రాంతాలలో రూట్ చెక్ నిర్వహించారు. ఎంవీఐ చట్టం కింద ఓవర్‌లోడ్, లైసెన్స్, ట్యాక్స్, పర్మిట్ వంటి ఉల్లంఘనలకు సంబంధించి మొత్తం 11 కేసులు నమోదు చేశారు. వాహనాలను సీజ్ చేసి, వాహన డ్రైవర్లపై సుమారు రూ. 4.37లక్షలు జరిమానా విధించారు. మైనింగ్ చట్టం కింద ఇసుక రవాణాలో నిబంధనల ఉల్లంఘనకు గానూ మొత్తం 5 కేసులు నమోదు చేశారు సుమారు రూ. 63వేలు జరిమానా విధించారు. 16 కేసుల ద్వారా రూ. 5లక్షల జరిమానా విధించారు.






