Telanagan Police : నకిలీ విత్తనాలు అమ్మితే పీడీయాక్ట్ : తెలంగాణ పోలీసుల హెచ్చరిక

by Muthe.Rajitha |

వర్షాకాలం మొదలవడంతో రైతులు(Farmers) పంటలు ప్రారంభించడానికి సిద్ధం అవుతున్నారు.

Telanagan Police : నకిలీ విత్తనాలు అమ్మితే పీడీయాక్ట్ : తెలంగాణ పోలీసుల హెచ్చరిక
X

దిశ, వెబ్ డెస్క్ : వర్షాకాలం మొదలవడంతో రైతులు(Farmers) పంటలు ప్రారంభించడానికి సిద్ధం అవుతున్నారు. అయితే ఇదే అదనుగా నకిలీ విత్తన కంపెనీలు(Fake Seed Companies), వ్యాపారులతో కలిసి రైతులను నట్టేట ముంచడానికి రెడీ అవుతూ ఉంటాయి ఈ నేపథ్యంలో తెలంగాణలో నకిలీ విత్తనాల అమ్మకాలను అరికట్టేందుకు పోలీసు(Telangana Police) శాఖ కఠిన చర్యలు తీసుకుంటోంది. రైతులను మోసం చేస్తూ నకిలీ, నాసిరకం విత్తనాలు అమ్మితే ప్రివెన్షన్ ఆఫ్ డ్యామేజ్ టు పబ్లిక్ ప్రాపర్టీ యాక్ట్(PD Act) కింద కేసులు నమోదు చేస్తామని విత్తన వ్యాపారులను, కంపెనీలను హెచ్చరించారు. ఇటీవల ఖమ్మం, నల్గొండ, వికారాబాద్, గద్వాల్, రాచకొండ, వరంగల్, రామగుండం వంటి ప్రాంతాల్లో దాడులు చేసిన పోలీసులు నకిలీ విత్తనాలు, నిషేధిత హెర్బిసైడ్-టాలరెంట్ (B.G. III) కాటన్ విత్తనాలు, నాసిరకం పురుగుమందులను స్వాధీనం చేసుకున్నారు.

డీజీపీ జితేందర్ నేతృత్వంలో పోలీసు, వ్యవసాయ శాఖ, విత్తన సంస్థ అధికారులతో కూడిన జాయింట్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి, నకిలీ విత్తనాల విక్రయాలపై చట్టపరమైన చర్యలు తీసుకుంనేందుకు సిద్ధం అవుతోంది. సీడ్స్ యాక్ట్, ఎన్విరాన్‌మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్, భారతీయ న్యాయ సంహిత(BNS) కింద కేసులు నమోదుచేస్తామని వార్నింగ్ ఇచ్చారు.

Next Story