కలెక్టర్లతో చర్చించాకే మొక్కలు నాటే స్థలం ఎంపిక

by Naga Rani Yarlagadda |

కలెక్టర్లతో చర్చించాకే మొక్కలు నాటే స్థలాలను ఎంపిక చేయాలని అటవీ దళాల ప్రధాన సంరక్షణాధికారిణి (పీసీసీఎఫ్) డాక్టరు సువర్ణ ఆదేశించారు. శనివారం అరణ్య భవన్లో అన్ని జిల్లాల డీఎఫ్ఓలతో సమావేశమయ్యారు. పీసీసీఎఫ్ గా బాధ్యతలు చేపట్టాక ఆమె అధ్యక్షతన మొదటిసారిగా సమావేశం నిర్వహించారు.

కలెక్టర్లతో చర్చించాకే మొక్కలు నాటే స్థలం ఎంపిక
X
  • వనమహోత్సవానికి ప్రజాభాగస్వామ్యం తప్పని సరి
  • పెండింగ్ పనులు త్వరగా పూర్తి
  • పీసీసీఎఫ్ డాక్టరు సువర్ణ ఆదేశం

దిశ, తెలంగాణ బ్యూరో: కలెక్టర్లతో చర్చించాకే మొక్కలు నాటే స్థలాలను ఎంపిక చేయాలని అటవీ దళాల ప్రధాన సంరక్షణాధికారిణి (పీసీసీఎఫ్) డాక్టరు సువర్ణ ఆదేశించారు. శనివారం అరణ్య భవన్లో అన్ని జిల్లాల డీఎఫ్ఓలతో సమావేశమయ్యారు. పీసీసీఎఫ్ గా బాధ్యతలు చేపట్టాక ఆమె అధ్యక్షతన మొదటిసారిగా సమావేశం నిర్వహించారు. అటవీశాఖకు సంబంధించిన అన్ని అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. రాష్ట్రవ్యాప్తంగా నిలిచిపోయిన, కొత్తగా చేపట్టాల్సిన పనులపై ఆరా తీశారు. నిధుల ఖర్చు, బీడీ ఆకుల సేకరణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. ఈ ఏడాది వనమహోత్సవం కార్యక్రమం దిగ్విజయంగా నిర్వహించాలని, అందుకు సంబంధించిన కార్యక్రమాల ప్రణాళికను ముందుగానే రూపొందించాలన్నారు. వనమహోత్సవంలో ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమానికి కంపా, హరితనిధికి సంబంధించిన నిధులను ఉపయోగించాలని తెలిపారు. అలాగే అడవుల సంరక్షణ విషయంలో ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. ప్రధానంగా అగ్ని ప్రమాదాలు, అక్రమల రవాణ, వన్యప్రాణుల వేట వివిధ సంఘటనల బారి నుంచి అటవీ జంతువును రక్షించుకోవాలని సూచించారు. జిల్లాల్లో గత వార్షిక సంవత్సరంలో పెండింగ్ లో ఉన్న పనులు త్వరగా పూర్తి చేసి లక్ష్యాలను సాధించాలన్నారు. ఈ సమావేశంలో పీసీసీఎఫ్(అడ్మిన్) సునీత భగవత్, సీసీఎఫ్ లు రామలింగం, ప్రియాంక వర్గీస్. భీమా నాయక్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

Next Story