Mahesh Kumar Goud: రేవంత్ రెడ్డి విలక్షణమైన నాయకుడు

by Gantepaka Srikanth |

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)పై పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Mahesh Kumar Goud: రేవంత్ రెడ్డి విలక్షణమైన నాయకుడు
X

దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)పై పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. విలక్షణమైన నాయకుడు రేవంత్ రెడ్డి అని అన్నారు. చిన్న వయసులో రాజకీయాల్లో డైనమిక్ లీడర్‌గా ఎదిగారని కొనియాడారు. ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కి, నిర్బందాలతో పాలన చేస్తున్న కేసీఆర్(KCR) మీద పోరాటం చేసిన వ్యక్తి రేవంత్ రెడ్డి అని అన్నారు. రేపు ఆయన పుట్టిన రోజు(Revanth Birthday) సందర్భంగా ఒకే ఒక్కడు పుస్తక ఆవిష్కరణ చేసుకున్నామని తెలిపారు. ఒకే ఒక్కడు పుస్తకాన్ని రచించిన వేణుగోపాల్ రెడ్డి, విజయార్కేకు అభినందనలు చెప్పారు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్(Telangana Congress) కమిటీ నుంచి ముందుగా రేవంత్ రెడ్డికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో సంతోషంగా ఎక్కువకాలం రాజకీయాల్లో ఉండాలని మనస్సుపూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు.

Next Story