కాసేపట్లో పీసీసీ కార్యవర్గ సమావేశం.. ఎజెండాలో చర్చించే ప్రధాన అంశాలివే!

by Kema Shiva Kumar |   (  Updated:2025-12-02 05:24:42  IST  )

టీపీపీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) అధ్యక్షతన నగరంలోని గాంధీ భవన్‌లో రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ (PCC) సమావేశం కాసేపట్లో ప్రారంభం కానుంది.

కాసేపట్లో పీసీసీ కార్యవర్గ సమావేశం.. ఎజెండాలో చర్చించే ప్రధాన అంశాలివే!
X

దిశ, వెబ్‌డెస్క్: టీపీపీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) అధ్యక్షతన నగరంలోని గాంధీ భవన్‌లో రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ (PCC) సమావేశం కాసేపట్లో ప్రారంభం కానుంది. ఈ భేటీకి సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)తో పాటు ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ (Meenakshi Natarajan), ఏఐసీసీ కార్యదర్శులు విశ్వనాథన్, సచిన్ సావంత్, మంత్రులు, కొత్తగా ఎన్నికైన పార్టీ జిల్లా అధ్యక్షులు, పూర్వ అధ్యక్షులు హాజరుకానున్నారు. ఈ సమాశంలో భాగంగా కొత్తగా నియమితులైన జిల్లా కాంగ్రెస్ కమిటీ (DCC) అధ్యక్షులకు ఘన స్వాగతం పలకనున్నారు. పార్టీ బలోపేతం కోసం కొత్త డీసీసీ అధ్యక్షులు చురుకుగా పనిచేయాలని రాష్ట్ర నాయకత్వం దిశానిర్దేశం చేయనుంది. అదే సమయంలో, తమ పదవీకాలంలో పార్టీకి విశేష సేవలు అందించిన పూర్వ డీసీసీ అధ్యక్షులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయనున్నారు.

స్థానిక ఎన్నికల్లో వ్యూహంపై కీలక చర్చ..

ఈ పీసీసీ సమావేశంలో అత్యంత ప్రధానంగా రాష్ట్రంలో జరుగుతోన్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలపై విస్తృత స్థాయిలో చర్చ జరగనున్నట్లుగా తెలుస్తోంది. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం, ప్రతి గ్రామంలో కాంగ్రెస్ (Congress) మద్దతుదారుల విజయం కోసం సమన్వయంతో పనిచేయాలని సీఎం పార్టీ శ్రేణులకు పిలుపునివ్వనున్నారు. క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలను పరిష్కరించే విధంగా ప్రచార ప్రణాళిక రూపొందించనున్నారు. అదేవిధంగా ప్రభుత్వం ఇటీవల చేపట్టబోతున్న ‘ప్రజాపాలనా వారోత్సవాల’ విజయవంతం చేయడంపై సమావేశంలో డిస్కస్ చేయనున్నారు. ఇక పార్టీని అట్టడుగు స్థాయి నుంచి పటిష్టం చేసే లక్ష్యంతో, జిల్లాల్లో మండల కమిటీలు, బ్లాక్ అధ్యక్షుల నియామకాన్ని తక్షణమే పూర్తి చేయాలని డీసీసీ అధ్యక్షులకు ఆదేశాలు జారీ చేయనున్నట్లుగా సమాచారం. నెల రోజుల్లో ఈ నియామక ప్రక్రియను ముగించి, పార్టీని ఎన్నికలకు సంసిద్ధం చేయాలని నిర్దేశించనున్నారు. మరో వైపు ఈ చర్యలు పార్టీ పటిష్టతపై కీలక ప్రభావాన్ని చూపుతాయని రాష్ట్ర నాయకత్వం విశ్వాసం వ్యక్తం చేస్తోంది. సమావేశం చివరలో మిగతా ఇతర అంశాలను పార్టీ అధ్యక్షుల వారి అనుమతితో చర్చించి బోయే రాజకీయ కార్యక్రమాలపై స్పష్టమైన కార్యాచరణను ఖరారు చేయనున్నారు.

Next Story