- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మనిషికి అత్యాశ ఉండకూడదు.. కవిత వ్యాఖ్యలకు పీసీసీ చీఫ్ కౌంటర్
మనిషికి అత్యాశ ఉండకూడదు.. కవిత వ్యాఖ్యలకు పీసీసీ చీఫ్ కౌంటర్

దిశ, తెలంగాణ బ్యూరో: ‘కవితకు సీఎం కావాలనే ఆశ ఉంటే తప్పు లేదు. కానీ, మనిషికి అత్యాశ ఉండకూడదు. కవిత కొన్ని వాస్తవాలను బయటపెడుతున్నారు. ఆమె ఆరోపణలపై విచారణ చేయించాలని సీఎం దృష్టికి తీసుకెళ్తా’ అని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్‌గౌడ్ చెప్పారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. సర్పంచులుగా గెలిచిన కాంగ్రెస్ మద్దతు దారులకు అభినందనలు తెలిపారు. మొదటి విడత సర్పంచ్ ఎలక్షన్‌లో 4,230 పంచాయతీలకు గాను కాంగ్రెస్ మద్దతుదారులు 2,600 పైచిలుకు స్థానాల్లో గెలిచారని వెల్లడించారు. ఏకగ్రీవం అయిన చోట్ల 90 శాతం కాంగ్రెస్ మద్దతుదారులే గెలిచారని చెప్పారు. చాలా చోట్ల బీజేపీ, బీఆర్ఎస్ కలిసి పోటీ చేశాయని.. అయినా వెయ్యికి దగ్గరగా బీఆర్ఎస్, 200లోపు బీజేపీ, 40 స్థానాలు సీపీఎం,30 స్థానాల్లో సీపీఐ అభ్యర్థులు గెలిచారని పేర్కొన్నారు. రెండు, మూడో విడత ఎన్నికల్లోనూ ప్రజలు కాంగ్రెస్ మద్దతుదారులకు పట్టం కట్టాలని విజ్ఞప్తి చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో అభివృద్ధి, సంక్షేమం ఇందుకు నిదర్శనమన్నారు. సర్పంచ్ ఫలితాలపై సీఎం సంతృప్తిగా ఉన్నారన్నారు.
వికాసం వైపు తెలంగాణ రాష్ట్రం
తెలంగాణ వికాసం వైపు పయనిస్తున్నదని మహేశ్‌కుమార్‌గౌడ్ చెప్పారు. 15 మాసాల్లో 80 వేలకు పైగా ఉద్యోగాలు ఇచ్చామని.. ఉచిత బస్సు మొదలుకొని సన్న బియ్యం వరకు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు. ఇతర రాష్ట్రాల్లో లేని సంక్షేమాన్ని తెలంగాణలో ఇస్తున్నామని వెల్లడించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు 25 వేలకు పైగా మెజార్టీ ప్రజలు ఇచ్చారని.. అభివృద్ధి, సంక్షేమంతోపాటు సామాజిక న్యాయం మెచ్చి ప్రజలు తీర్పు ఇచ్చారని తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో పనిచేసిన మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు, స్థానిక నాయకులకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలిపారు. అలాగే.. గ్లోబల్ సమ్మిట్‌తో ఊహించని విధంగా 5 లక్షల 75 వేల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయని.. రాష్ట్రంపై పెట్టుబడిదారులకు నమ్మకం, విశ్వాసం పెరిగిందని అన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో వచ్చిన పెట్టుబడులు ఎన్నని నిలదీశారు.
14న ఢిల్లీలో మహాధర్నా
14 లక్షల వరకు ఓటు చోరీ సంతకాల సేకరణ జరిగిందని.. ఈ నెల 14వ తేదీన రామ్ లీలా మైదాన్‌లో మహాధర్నా నిర్వహిస్తున్నామని.. దీనికి సీఎం రేవంత్, కేబినెట్ మొత్తం, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పీఏససీ సభ్యులు హాజరవుతారని చెప్పారు. మహా ధర్నాలో పెద్ద ఎత్తున నాయకులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. ధర్నా రోజే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు మెమోరాండం ఇచ్చే కార్యక్రమం ఉంటుందన్నారు. ఓటు చోరీతోనే తెలంగాణలో బీజేపీ ఎంపీలు గెలిచారని.. బీజేపీ ఎమ్మెల్యేలకు, ఎంపీలకు వేసిన ఓట్లు ఎక్కడ పోయాయని ప్రశ్నించారు.






