- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణ కేబినెట్ ప్రక్షాళనపై పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు
by Prasad Jukanti |
తెలంగాణ కేబినెట్ ప్రక్షాళనపై పీసీసీ చీఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

X
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ కేబినెట్ ప్రక్షాళనపై (Telangana Cabinet Reshuffle) టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర కేబినెట్ ప్రక్షాళన కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఈ విషయంలో అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అని అంతరంగికంగా చెప్పినట్లు ఇవాళ ఓ తెలుగు న్యూస్ చానల్ పేర్కొంది. ఇవాళ ఢిల్లీలో సదరు న్యూస్ చానల్‍తో మాట్లాడిన ఆయన.. నిన్న ఢిల్లీకి రాహుల్ గాంధీతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy), తాను, పార్టీ నేతలు కలిసి ఒకే విమానంలో ప్రయాణించినప్పుడు జరిగిన సంభాషణపై కీలక విషయాలు వెల్లడించారు. తెలంగాణలో పార్టీ బలోపేతంపై రాహుల్ గాంధీ దిశానిర్దేశం చేశారని చెప్పారు. రాష్ట్రంలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల ఫలితాలు, జూబ్లీహిల్స్ ఫలితాలపై సీఎం రాహుల్ గాంధీకి వివరించారని, దేశ, విదేశాల్లో రాజకీయ పరిస్థితులపై చర్చించుకున్నామని చెప్పారు.
Next Story






