- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Congress: పార్టీలో పట్టాదారులు.. కౌలు దారులు అంటూ ఏమీ ఉండవు: పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్
జీవన్ రెడ్డి వ్యాఖ్యల నేపథ్యంలో పీసీసీ చీఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ కాంగ్రెస్‍లో (Congress) కొండా సురేఖ (Konda Surekha) ఓఎస్డీ వివాదం మరిచిపోకముందే మాజీ మంత్రి జీవన్ రెడ్డి (Jeevan Reddy) చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఒకరి తర్వాత మరొక కీలక నేతలు చేస్తున్న వ్యాఖ్యల నేపథ్యంలో ఈ వరుస వివాదాలపై పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) స్పందించారు. కొండా సురేఖ ఎపిసోడ్ లో చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల సమస్య వచ్చిందని, సీఎంను కలిసిన తర్వాత అంతా సెట్ అయిందనన్నారు. సీఎంకు మంత్రులంతా సమానేమేనని చెప్పారు. ఇవాళ ఓ న్యూస్ చానల్‍తో మాట్లాడిన ఆయన.. మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అసంతృప్తి మా దృష్టికి వచ్చిందని పార్టీలో పట్టాదారులు, కౌలుదారులు అంటూ ఏమీ ఉండవన్నారు. డీసీసీ ఎంపిక ప్రజాస్వామ్య బద్ధంగా ఉంటుందని ఈ ఎంపికలో ఎవరి ప్రమేయం ఉండదన్నారు. డెక్కన్ సిమెంట్ తో పాటు అక్కడ ఉన్న మరో సిమెంట్ కంపెనీతో స్థానికంగా ఉన్న ఇబ్బందులపై విచారణ చేయమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారన్నారు. నిన్న సీఎం, కొండా దంపతులు మాట్లాడుకుని ఈ సమస్యకు ఫుల్ స్టాప్ పెట్టారన్నారు. భవిష్యత్‍లో పార్టీ బలోపేతంపై ఈ భేటీలో కూడా చర్చకు వచ్చిందన్నారు.
మీ అలవాటు మాకెందుకు రుద్దుతున్నారు:
వాటాల పంపిణీలోనే సీఎంకు మంత్రులకు మధ్య విభేదాలు ఏర్పడుతున్నాయని బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలను మహేశ్ కుమార్ గౌడ్ ఖండించారు. అధికారంలో ఉండగా పదేళ్లు వాటాలకు అలవాటు పడి అలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. వారికున్న అలవాట్లను మాకు రుద్దే ప్రయత్నం చేస్తున్నారని ప్రతిపక్షాల విమర్శలను ప్రజలు పట్టించుకునే పరిస్థితుల్లో లేరన్నారు.






