- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏఐసీసీ ఓబీసీ సమావేశం హైదరాబాద్‌లోనే.. టీ కాంగ్రెస్ మరో బిగ్ స్కెచ్!

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాజకీయాల్లో ఓబీసీ అంశం గత కొంత కాలంగా ప్రధాన అంశంగా మారింది. ఓబీసీలను ప్రసన్నం చేసుకునేందుకు ప్రధాన పార్టీలు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ క్రమంలో రాష్ట్రంలో కులగణన చేపట్టి ఆ లెక్కలను ప్రభుత్వం విడుదల చేసిన నేపథ్యంలో అధికార కాంగ్రెస్ ఈ అంశంలో మరో కీలక ప్రణాళిక రచిస్తున్నట్లు తెలుస్తోంది. రాబోయే ఏఐసీసీ జాతీయ ఓబీసీ సలహా మండలి సమావేశాన్ని హైదరాబాద్‍లో నిర్వహించేలా రాష్ట్ర కాంగ్రెస్ ప్రణాళిక రచిస్తోంది. ఈ మేరకు ఇవాళ ఢిల్లీలో ఏఏసీసీ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ అయిన పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ రాబోయే ఏఐసీసీ జాతీయ ఓబీసీ సలహా మండలి సమావేశాన్ని హైదరాబాద్‍లో నిర్వహించాలని కోరగా ఇందుకు రాహుల్ సానుకూలంగా స్పందించినట్లు వెల్లడించారు. ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రంలో సమగ్ర కులగణన జరిపి అధికారిక సమాచారాన్ని ప్రకటించినట్టుగా రాహుల్ గాంధీకి మహేశ్ కుమార్ గౌడ్ వివరించారు. మహిళ రిజర్వేషన్ల బిల్లులో బీసి రిజర్వేషన్ల అంశాన్ని కూడా జోడించాలని ఈ సందర్భంగ రాహుల్‍కు విజ్ఞప్తి చేశారు.
తాజా పరిణామాలపై కీలక చర్చ:
ఇవాళ ఢిల్లీలోని 10 జన్‍పథ్‍లో జరిగిన రాహుల్ ను కలిసిన మహేశ్ కుమార్ గౌడ్.. ఈ సందర్భంగా రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలు, అభివృద్ధి, సంక్షేమ పథకాలపై రాహుల్ గాంధీకి వివరించారు. దాదాపు 15 నిమిషాల పాటు జరిగిన సమావేశంలో పలు అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పార్టీ పరంగా జరుగుతున్న ఆర్గనైజేషన్ కార్యక్రమాలను రాహుల్ కు వివరించారు. డీసీసీ అధ్యక్షుల నియామకాలు, జిల్లా కమిటీలు, మండల కమిటీలు, బిఎల్‍లోల నియామకాలు, అనుబంధ సంఘాల నియామకాలు తదితర అంశాలపై సమావేశంలో రాహుల్ గాంధీకి వివరించారు.






