- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
T Congress: కాంగ్రెస్ ఆపరేషన్ లోకల్.. సీఎంతో పీసీసీ చీఫ్, మంత్రి పొన్నం కీలక భేటీ
దసరా తర్వాత భాలీ ప్లాన్ కు కాంగ్రెస్ వ్యూహ రచన చేస్తోంది.

దిశ, డైనమిక్ బ్యూరో: స్థానిక సంస్థల ఎన్నికలు, జూబ్లీహిల్స్ బై పోల్‍లో గెలుపే లక్ష్యంగా అధికార కాంగ్రెస్ (Congress) పార్టీ కసరత్తు చేస్తోంది. ఈ రెండు ఎన్నికల్లో అభ్యర్థుల ఖరారుపై పార్టీ దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో (Revanth Reddy) టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud), మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) భేటీ అయ్యారు. ఇవాళ ఉదయం జూబ్లీహిల్స్ లోని సీఎం నివాసంలో జరిగిన ఈ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, బీసీ రిజర్వేషన్ల అంశంలో కోర్టు కేసు వంటి కీలక అంశాలపై చర్చించినట్లు సమాచారం. జడ్పీటీసీ స్థానాలకు అభ్యర్థుల పేర్ల జాబితాను అక్టోబర్ 5వ తేదీ నాటికి పీసీసీకి పంపించాలని మంత్రులు, డీసీసీ అధ్యక్షులకు నిన్న జూమ్ మీటింగ్‍లో సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఇవాళ జరిగిన భేటీలో బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు కేసు, తాజా పరిస్థితులపై అనుసరించాల్సిన వ్యూహాలపై సీఎం దిశా నిర్దేశం చేసినట్లు సమాచారం.
దసరా తర్వాత బీసీ సభ!:
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికలు కావడం చేత ఈ ఎన్నికల్లో పై చేయి సాధించేందుకు హస్తం పార్టీ ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగా దసరా తర్వాత బీసీ గర్జన నిర్వహణకు ప్లాన్ చేస్తోంది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించిన దృష్టా త్వరలోనే బీసీ సంఘాల నేతలతో పీసీసీ చీఫ్ సమావేశం కాబోతున్నారు. బీసీల పట్ల కాంగ్రెస్ కమిట్ మెంట్‍ను వారికి వివరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే అక్టోబర్ 8వ తేదీన రిజర్వేషన్లపై హైకోర్టు నిర్ణయం నేపథ్యంలో ప్రభుత్వానికి బీసీ సంఘాల మద్దతు కూడగట్టుకునేలా బీసీ సంఘాలను మోటివేట్ చేయబోతున్నట్లు సమాచారం.






